News January 12, 2026
అనకాపల్లి: బొలెరో వాహనం బీభత్సం

పాయకరావుపేట మండలం నామవరం వద్ద సోమవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 గొర్రెలు మృతి చెందగా, మరో 20 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. నామవరం నుంచి గొర్రెల కాపరులు పాయకరావుపేట వైపు మందను తోలుతుండగా వెనకనుంచి బొలెరో వాహనం ఢీకొట్టి ఆగకుండా పోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 17, 2026
జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మికి చుక్కెదురు

AP: YS జగన్ అక్రమాస్తుల కేసులో IAS శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. కేసులో తన పేరును తొలగించాలన్న డిశ్ఛార్జ్ పిటిషన్‌ను SC తిరస్కరించింది. HC తీర్పును సమర్థించింది. నిబంధనలకు అనుగుణంగా తాను పనిచేశానని శ్రీలక్ష్మి విన్నవించగా రూల్స్‌ను పాటించలేదని CBI వాదించింది. శ్రీలక్ష్మి అండతో ఆమె మరిది భారీగా ఆస్తులు కూడబెట్టారని, ఆమె కూడా నేరుగా లంచం డిమాండ్ చేసినట్లు సాక్షులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపింది.
News February 17, 2026
సిద్దిపేట: మహిళా మణులకే పదవులు!

సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ పదవులు మహిళలకు రిజర్వాయ్యాయి. దీంతో కీలకమైన పదవిలో 4 మహిళా మణులు బాధ్యతలు స్వీకరించారు. చేర్యాల మున్సిపాలిటీ వైస్ ఛైర్‌పర్సన్‌గా మేడిశెట్టి ఉమా, దుబ్బాక-ఆశ సులోచన, గజ్వేల్-ప్రజ్ఞాపూర్-కళ్యాణ్ కర్ పద్మాభాయి, హుస్నాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా చిత్తారి పద్మ పదవి చేపట్టారు. ఇక్కడ ఛైర్ పర్సన్‌లు కూడా మహిళలే.
News February 17, 2026
BREAKING: ఇంద్రేశం ఛైర్మన్ పీఠం BRS కైవసం

కోరం లేక వాయిదా పడిన ఇంద్రేశం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. రెండో రోజు 10 మంది BRS, ఇద్దరు BJP కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయడంతో కోరం లభించింది. అనంతరం జరిగిన ఎన్నికలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా 8వ వార్డు BRS కౌన్సిలర్ కుషాంగుల ప్రమీల, వైస్ ఛైర్మన్‌గా 12వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గానికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.


