News March 2, 2025
అనకాపల్లి: మహిళా పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఓపెన్ హౌస్

రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో మహిళల భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు శనివారం మెడికల్ క్యాంపు, ఓపెన్ హౌస్‌ను సందర్శించారు. మహిళలు, విద్యార్థినిలకు స్టేషన్ ఎస్ఐ, సీఐలు పోలీస్ స్టేషన్‌లో జరుగు విధులు పట్ల అవగాహన కల్పించారు.
Similar News
News July 4, 2025
HYDలో భారీగా ట్రాఫిక్ జామ్

HYDలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఎల్బీస్టేడియంలో బహిరంగ సభకు INC శ్రేణులు వందలాది వాహనాల్లో తరలివచ్చాయి. ఈ ప్రభావంతో PVNR ఎక్స్‌ప్రెస్ వే నుంచి మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి నాంపల్లి, పంజాగుట్ట నుంచి రవీంద్రభారతి రూట్‌లో వాహనాలు కిలో మీటర్ మేర నిలిచిపోయాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రద్దీ మరింత పెరుగుతోంది.
News July 4, 2025
HYDలో భారీగా ట్రాఫిక్ జామ్

HYDలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఎల్బీస్టేడియంలో బహిరంగ సభతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఈ ప్రభావంతో PVNR ఎక్స్‌ప్రెస్ వే నుంచి మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్ నుంచి నాంపల్లి, పంజాగుట్ట నుంచి రవీంద్రభారతి రూట్‌లో వాహనాలు కిలో మీటర్ మేర నిలిచిపోయాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రద్దీ మరింత పెరుగుతోంది.
News July 4, 2025
ఫ్లడ్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

జిల్లాలో వరదలు ఎప్పుడు సంభవించిన ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఆదుకునేందుకు మండలాల వారీగా ఫ్లడ్ యాక్షన్ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలు, మండలాల వారీగా వరద సహాయక చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని, ముంపు గ్రామాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.