News February 16, 2025
అనకాపల్లి: మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో మెరిసిన నేవీ ఉద్యోగి

అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలోని శంభు వానిపాలానికి చెందిన నేవీ ఉద్యోగి అప్పన్న దొర జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటారు. రాజస్థాన్‌లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో 45 ఏళ్ల విభాగంలో 4×400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాన్ని, 4×100 200 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ కాంస్య పతకం పొందారు. ఆదివారం ఆయనను గ్రామస్థులు సత్కరించారు.
Similar News
News November 10, 2025
చక్కెర తినడం మానేస్తే..

చక్కెర తినడం మానేస్తే శరీరంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘శక్తి స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన నిద్ర ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఆకలి తగ్గుతుంది. సాధారణంగా బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె, కాలేయం మరింత ఆరోగ్యవంతంగా మారుతాయి. చిరాకు, ఆందోళన తగ్గి ఫోకస్ పెరుగుతుంది. అయితే ఒక్కసారిగా మానేయకుండా క్రమంగా తగ్గించాలి’ అని సూచిస్తున్నారు.
News November 10, 2025
జూబ్లీ బైపోల్: సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలటరీలు

జూబ్లీ ఉప ఎన్నిక కోసం EC మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 50 శాతానికి పైగా 65 ప్రాంతాల్లోని 226 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా బందోబస్తు నిర్వహించనున్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలను మోహరించనున్నారు. NOV 14న ఓట్ల లెక్కింపు కోసం 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
News November 10, 2025
13 నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీలో తరగతుల రద్దు

AU ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో పార్ట్నర్షిప్ సమిట్-2025 జరగనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ వరకు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు తరగతులను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. హాస్టల్ విద్యార్థులు తమ గుర్తింపు కార్డులను చూపి బయటకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థినులు మద్దిలపాలెం గేటు, విద్యార్థులు పోలమాంబ ఆలయం పక్కన ఉన్న గేటు వినియోగించాలి.


