News April 24, 2025

అనకాపల్లి: మే 19 నుంచి ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలు

image

అనకాపల్లి జిల్లాలో ఓపెన్ స్కూల్‌కు సంబంధించి సెకండరీ బోర్డు, 10వ తరగతి పరీక్షలు మే 19 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. మే 28వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 24 నుంచి 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. అధికారిక వెబ్‌సైట్‌లో హెచ్.ఎం లాగిన్ నుంచి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

Similar News

News April 24, 2025

జగిత్యాల : మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు: జీవన్‌రెడ్డి

image

JGTL ఇందిరాభవన్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మామిడి రైతులు మార్కెట్లో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రేడర్లు నిబంధనలు పాటించక, మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ లోపంతో రైతులపై భారం పడుతుందని తెలిపారు. కమీషన్ల దోపిడీ, నాణ్యత, గ్రేడింగ్ పేరుతో నష్టం, మౌలిక వసతుల లోపం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

News April 24, 2025

మల్యాలలో భూభారతి అవగాహన సదస్సు

image

మల్యాల మండలం ముత్యంపేట గ్రామం రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఈరోజు భూభారతి పైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో రైతులు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News April 24, 2025

పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు: బీసీసీఐ

image

ఇకపై భారత్‌, పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఉండబోవని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. IND, PAK మధ్య చివరగా 2012-13లో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి ICC టోర్నీల్లో మాత్రమే IND, PAK తలపడుతున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో ఇక భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించవద్దని BCCI నిర్ణయించినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!