News February 5, 2025

అనకాపల్లి: మొబైల్ ఫోన్‌ల రికవరీ మేళా

image

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈనెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు మొబైల్ ఫోన్‌ల రికవరీ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా పోలీస్ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు రూ.కోటి విలువైన మొబైల్ ఫోన్‌లను బాధితులకు అందజేస్తామని తెలియజేసింది. 9వ విడత రికవరీ మేళా నిర్వహిస్తున్నామని వివరించింది. జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా చేతుల మీదుగా మొబైల్ ఫోన్లు అందజేస్తారని తెలిపింది.

Similar News

News November 3, 2025

జనగామ జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలు

image

జనగామ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 42.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పాలకుర్తిలో 2.8, జఫర్‌గఢ్ 3.8, కొడకండ్ల 8.2, తరిగొప్పుల 15.2, నర్మెట్ట 8.6, జనగామ 1.4, రఘునాథపల్లి 1.2, లింగలఘనపూర్ 1.0మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.

News November 3, 2025

విశాఖలో దంపతుల మృతిపై వీడని మిస్టరీ

image

అక్కయ్యపాలెం సమీపంలో భార్యాభర్తలు వాసు, అనిత <<18182096>>మృతిపై<<>> పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనాస్థలంలో బెడ్‌పై అనిత మృతదేహం, వాసు ఉరితాడుకు వేలాడడం అనుమానాలకు తావిస్తోంది. భార్యను చంపిన అనంతరం వాసు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక వేరే ఏదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వివాహం జరగగా వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని బంధువులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

News November 3, 2025

ఘోర ప్రమాదాలు.. 10 రోజుల్లో 60 మంది దుర్మరణం!

image

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత పది రోజుల్లో జరిగిన వేర్వేరు ఘోర ప్రమాదాల్లో దాదాపు 60మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మరణించారు. ఇంతకుముందు కర్నూలులో 20, రాజస్థాన్‌లో 15, బాపట్లలోని సత్యవతిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో 4 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ఘటనలు ప్రయాణ భద్రతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.