News February 3, 2026
అనకాపల్లి: రికార్డు స్థాయిలో బెల్లం అమ్మకాలు

అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో సోమవారం రికార్డు స్థాయిలో బెల్లం అమ్మకాలు జరిగాయి. రైతులు 13,005 బెల్లం దిమ్మలను తీసుకువచ్చి విక్రయించారు. మొదటి రకం బెల్లం 100 కిలోలు రూ.4,170,రెండవ రకం రూ.4,020,మూడవ రకం 3,540 ధర పలికింది. ఇక్కడి నుంచి బెల్లం ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, ఏపీలో వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News February 4, 2026
HYD: సీక్రెట్ బేస్‌మెంట్లలో కొత్త మ్యూజిక్

సిటీ అంతా రీల్స్ గోలలో ఉంటే, కొందరు మాత్రం సీక్రెట్ బేస్‌మెంట్లలో కొత్త మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్టీల లొకేషన్ గంట ముందే వాట్సాప్‌లో వస్తుంది. తెలుగు డిస్కో నుంచి టెక్నో దాకా కొత్త ప్రయోగాలు ఇక్కడ వినొచ్చు. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూనే, మధ్యలో చుట్టాల పెళ్లిళ్ల కోసం షేర్వానీలు మార్చుకుని సిటీలోని ఫంక్షన్ హాళ్లలోకి జారిపోయే వింత సంస్కృతి వీరిది.
News February 4, 2026
WPL: ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో గుజరాత్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరింది. గుజరాత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఎల్లుండి జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, RCB జట్లు తలపడనున్నాయి.
News February 4, 2026
విశాఖ: క్యాంపస్ AI షార్ట్ వీడియో పోటీ పోస్టర్ ఆవిష్కరణ

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘క్యాంపస్ AI షార్ట్ వీడియో కాంపిటీషన్’ పోస్టర్‌ను వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మంగళవారం ఆవిష్కరించారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో కృత్రిమ మేధపై అవగాహన, సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యమన్నారు. AI ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. IIC నిర్వహిస్తున్న ఈ పోటీలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొనవచ్చు. ఉత్తమ వీడియోకు ప్రశంసాపత్రం అందజేస్తారు.


