News March 22, 2025
అనకాపల్లి: రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కశింకోట మండలం నేషనల్ హైవేపై ఎన్‌జీ పాలెం వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో డ్రైవర్ క్యాబిన్‌లోనే చిక్కుకున్నాడు. అతికష్టం మీద అతడిని బయటకు తీశారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 13, 2025
బాపట్ల జిల్లా నూతన SP ఇతనే.!

బాపట్ల జిల్లా నూతన ఎస్పీగా ఉమామహేశ్వర్ నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న తుషార్ డూడీని బదిలీ చేసి ఆయన స్థానంలో ఉమామహేశ్వర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఎస్పీ తుషార్ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఇప్పటికే జిల్లాకు నూతన కలెక్టర్ రాగా నేడు ప్రకటించిన ఎస్పీల బదిలీల్లో భాగంగా నూతన ఎస్పీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
News September 13, 2025
NRPT: లోక్ అదాలత్‌లో 5,581 కేసుల పరిష్కారం

నారాయణపేట, కోస్గి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 5,581 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా జరిమానాల రూపంలో ప్రభుత్వానికి రూ.22,17,956 ఆదాయం సమకూరిందని చెప్పారు. లోక్ అదాలత్ విజయవంతం కావడానికి కృషి చేసిన పోలీస్, ఎక్సైజ్, కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.
News September 13, 2025
ఇక విరిగిన ఎముకలు 3 నిమిషాల్లో ఫిక్స్!

విరిగిన ఎముకలను నయం చేసేందుకు చైనీస్ రీసెర్చర్స్ కొత్త పద్ధతిని కనుగొన్నారు. 3 నిమిషాల్లోనే అతుక్కునేలా చేసే ‘బోన్ 02’ అనే జిగురును జేజియాంగ్ ప్రావిన్స్‌లోని సర్ రన్ రన్ షా ఆస్పత్రి చీఫ్ సర్జన్ లిన్ బృందం ఆవిష్కరించింది. నీటిలో బ్రిడ్జిలకు ఆల్చిప్పలు బలంగా అతుక్కోవడాన్ని పరిశీలించి దీన్ని డెవలప్ చేశామంది. 150 మంది పేషెంట్లపై టెస్ట్ చేయగా సంప్రదాయ పద్ధతుల కంటే మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది.