News January 1, 2026

అనకాపల్లి: రేపటి నుంచి రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీ

image

జిల్లాలో రేపటి నుంచి 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రీసర్వే జరిగిన 373 గ్రామాల్లో గతంలో జారీ చేసిన 2,01,841 పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో రాజు ముద్రతో కొత్తవి రైతులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన పాస్ పుస్తకాలను రెవెన్యూ అధికారులకు అందజేసి రైతులు కొత్తవి పొందాలని కోరారు.

Similar News

News January 7, 2026

ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: కొప్పుల ఈశ్వర్

image

జగిత్యాలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాల క్రితం తమ చేతుల మీదగా ప్రారంభించిన ఎస్సీ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని బుధవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కేసీఆర్ పాలనలో స్టడీ సర్కిల్ కేంద్రాలు విజయవంతంగా నడిచాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడంలేదని విమర్శించారు. గతంలో స్టడీ సర్కిల్ ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు ఎంతో కృషి చేశాయని అన్నారు.

News January 7, 2026

పాలమూరు: ట్రాక్టర్ రూటర్ కిందపడి బాలుడి మృతి

image

NGKL జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన దుడ్డు మల్లేష్ కుమారుడు మిట్టు(3)ను పొలానికి తీసుకుని పొలానికి తీసుకెళ్లగా, అక్కడ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రూటర్ టైర్ కిందపడి మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బాలుడి మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

News January 7, 2026

BCCIపై మొయిన్ అలీ పరోక్ష ఆరోపణలు

image

IPL నుంచి ముస్తాఫిజుర్‌ను <<18748860>>తప్పించడాన్ని<<>> ENG క్రికెటర్ మొయిన్ అలీ తప్పుబట్టారు. ‘ఎన్నో ఏళ్ల కష్టానికి అతనికి ఈ కాంట్రాక్టు దక్కింది. ఇలా తప్పించడంతో ఎక్కువగా నష్టం జరిగేది అతడికే. పాలిటిక్స్ క్రికెట్‌ను ప్రమాదంలో పడేస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపాలి. ఇలాంటి సమస్యలపై AUS, ENG బోర్డులు ఎందుకు మాట్లాడవు. ICCని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలుసు’ అంటూ BCCIపై పరోక్ష ఆరోపణలు చేశారు.