News March 1, 2026

అనకాపల్లి: రేపటి నుంచి సంస్కృతం పేపర్ మూల్యాంకనం

image

ఇంటర్మీడియట్ సంస్కృతం పేపర్ మూల్యాంకనం ఈనెల 2వ తేదీ నుంచి అనకాపల్లి ఆదినారాయణ మహిళ కళాశాలలో జరుగుతుందని ఇంటర్ జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎం.వినోద్ బాబు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే మూల్యాంకనంలో వాల్యూషన్ ఆర్డర్ పొందిన అందరూ పాల్గొనాలన్నారు. రేపు మధ్యాహ్నం జిల్లా ఇంటర్ అధికారికి రిపోర్టు చేయాలన్నారు.

Similar News

News March 1, 2026

రెబ్బెన: ఇంట్లో యువకుడి సూసైడ్

image

రెబ్బెన మండలం రాజారాం గ్రామానికి చెందిన పూదరి కిరణ్(32) శనివారం రాత్రి తన నివాసంలో తాడుతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

News March 1, 2026

భూపాలపల్లికి గర్వకారణం.. అక్కాతమ్ముళ్లు!

image

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బౌసింగ్ పల్లికి చెందిన అక్క, తమ్ముడు చిందం సౌమ్య, గౌతమ్ జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ చూపారు. డెహ్రాడూన్ RIMC ఫలితాల్లో సౌమ్య తెలంగాణ నుంచి అర్హత సాధించిన ఏకైక బాలికగా నిలవగా, ఆలిండియా సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షలో గౌతమ్ జిల్లా ప్రథమ, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. వీరి విజయంపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

News March 1, 2026

అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 5వేల మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు టీచర్లుగా ప్రమోషన్లు, పూర్తి స్థాయి వేతనాలు ఇస్తామన్నారు. అమరావతిలో అంగన్వాడీ కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. కొత్తగా 5,000 మంది అంగన్వాడీ సహాయకులను నియమించనున్నట్లు వెల్లడించారు. వేతనాల పెంపు డిమాండ్‌నూ అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.