News November 4, 2025

అనకాపల్లి: రేపు జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన

image

రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈనెల 5న అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు అనకాపల్లిలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన విద్యుత్ సర్కిల్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారన్నారు. 10.45 గంటలకు కే.కోటపాడు మండలం చౌడువాడలోను, మధ్యాహ్నం 2.15 గంటలకు కింతలిలో విద్యుత్ సబ్ స్టేషన్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.

Similar News

News November 4, 2025

భూములు త్వరగా గుర్తించండి: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలోని నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు నిమిత్తం భూములు గుర్తించడం జరిగిందని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చింతలపూడి 69.5 ఎకరాలు, ఉంగుటూరు 31.84, పోలవరం 78.92, ఏలూరు 2.02, కైకలూరులో 5 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన దెందులూరు, నూజివీడు నియోజకవర్గాలకు భూములను త్వరగా గుర్తించాలని అధికారులకు ఆదేశించారు.

News November 4, 2025

HYD: ఓయూపై సీఎం ఫోకస్.. ప్రణాళిక రూపకల్పన

image

సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం అధ్యక్షతన అధికార యంత్రాగం విస్తృత సమావేశాలు నిర్వహిస్తోంది. రూ. వెయ్యి కోట్ల నిధులతో ఓయూను ప్రపంచ స్థాయి విద్యాకేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ మేరకు భాగస్వామ్య పక్షాలతో ఓయూ పాలకవర్గం సమావేశమైంది. పలు విషయాలపై చర్చించారు.

News November 4, 2025

సూర్యాపేట: అంతరాష్ట్ర దొంగ మధు అరెస్ట్

image

నడిగూడెం మండలం వల్లాపురానికి చెందిన అంతరాష్ట్ర దొంగ కిన్నెర మధు(37)ను HYD నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. OCT 30న HYDలో చేసిన ఓ చోరీ కేసులో అతనితోపాటు APకి చెందిన వ్యక్తి (35) నుంచి రూ.30 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, KG వెండి ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. మధు గతంలో 25కుపైగా కేసుల్లో జైలుకెళ్లాడు. 2018లో KDD PS వారు PD చట్టం ప్రయోగించారు. చివరగా 2024లో చర్లపల్లి జైలుకు వెళ్లాడు.