News September 21, 2025

అనకాపల్లి: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

అనకాపల్లి కలెక్టరేట్తో పాటు మండల, మున్సిపల్, డివిజన్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. నేరుగా రాలేనివారు సమస్యలను meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా పంపించడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్జీల పరిస్థితి తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు.

Similar News

News September 21, 2025

గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

image

మందస మండలం కొర్రాయిగేట్ సమీపంలో NH16 రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. మృతదేహాన్ని శ్రీకాకుళం RIMS హాస్పిటల్‌లో మార్చురీ గది వద్ద ఆచూకీ కోసం ఉంచారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఆచూకీ తెలిసిన వారు మందస స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.

News September 21, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. దీని ప్రభావంతో.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇవాళ రాత్రి 7గంటల వరకు ప్రకాశం(D) సింగరాయకొండలో 69.5MM, చిత్తూరు(D) యడమర్రిలో 61MM వర్షపాతం నమోదైందని తెలిపింది.

News September 21, 2025

పండుగ పూట తీవ్ర విషాదం.. ఇద్దరు చిన్నారులు మృతి

image

కరీంనగర్‌లో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది. బొమ్మకల్‌ రోడ్డులో ఉన్న సిమెంట్ పైపుల ఫ్యాక్టరీలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. బిహార్‌కు చెందిన బిట్టు కుమార్‌-సుధాదేవి కుమారులు సత్యం కుమార్‌, ఆర్యన్‌ కుమార్‌ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు పైపులు కూలింగ్‌ చేసే ట్యాంకులో పడిపోయారు. గమనించిన ఫ్యాక్టరీ సిబ్బంది వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.