News March 17, 2025
అనకాపల్లి: రైళ్లు ఆలస్యం.. సమాచార కేంద్రం ఏర్పాటు

విజయరామరాజుపేట వద్ద రైల్వే వంతెన కుంగిన నేపథ్యంలో విజయవాడ-విశాఖపట్నం మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గోదావరి, విశాఖ, సింహాద్రి, అమరావతి, గరీబ్‌రథ్, మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విశాఖ చేరుకోవడం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వేస్టేషన్‌లో సమాచార కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 08912746330, 08912744619 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 17, 2025
కథలాపూర్: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తండ్రియాల గ్రామంలో కాసారపు రాజగంగు (50) అనే మహిళ ఉరేసుకుని సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. భర్తతో పాటు కుమారుడు ఏమి పని చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బంది పరిస్థితులు తలెత్తాయన్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారిందని, ఆవేదనతో సోమవారం తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
News March 17, 2025
ఈ సమయంలో పండ్లు తింటున్నారా?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినడం ఎంతో అవసరం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వాటిని ఆస్వాదించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పరగడుపుతో అస్సలు తినకూడదు. అలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే కడుపు నిండా భోజనం చేసిన తర్వాత వీటిని తింటే శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోతాయి. పడుకునే ముందు తీసుకోకూడదు. అజీర్తి సమస్యలు వస్తాయి. డెయిరీ పదార్థాలతో కలిపి వీటిని తినకూడదు.
News March 17, 2025
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

TG: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ బిల్లు రూపొందించగా తాజాగా ఆమోదం లభించింది. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.