News December 26, 2025
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

అనకాపల్లి మండలం కొత్తూరు జంక్షన్ వద్ద ఈనెల 24వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై శేషగిరిరావు తెలిపారు. కసింకోట మండలానికి చెందిన పప్పల జ్ఞానేశ్వరరావు (31) ద్విచక్ర వాహనంపై అనకాపల్లి వెళుతూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని కేజీహెచ్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News February 15, 2026
కృష్ణా: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- బెంగుళూరు(SMVB) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.08581 VSKP- SMVB రైలు మార్చి 1 నుంచి 29 వరకు ప్రతి ఆదివారం, నం.08582 SMVB- VSKP మధ్య నడిచే రైలు మార్చి 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం ప్రయాణిస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని ఆదివారం ప్రకటించారు.
News February 15, 2026
నెల్లూరు: శివరాత్రి జాగరణ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

మహా శివరాత్రి సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్థులు ఉపవాసం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నీరు, పండ్ల రసాలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. రాత్రి వేళ డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రమత్తులో ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News February 15, 2026
జగిత్యాల ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్!

TG: జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ వీడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జెండా మోసిన వారికే ఛైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. MLA సంజయ్, జీవన్‌రెడ్డితో మంత్రి అడ్లూరి, AICC సెక్రటరీ సవాంగ్ మాట్లాడారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. 23 మంది అభ్యర్థులతో MLA సంజయ్ క్యాంప్ ఏర్పాటు చేయగా, 14 మందితో జీవన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.


