News January 30, 2025

అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

అనకాపల్లి పట్టణ పూడిమడక బస్ స్టాప్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. బుధవారం షేక్ సుభాన్ (60) ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు ముందు నుంచి నడిచి వెళుతున్నాడు. ఆ సమయంలోనే డ్రైవర్ గమనించకుండా బస్సును నడపడంతో సుభాన్‌ను ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 15, 2025

కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్: మంత్రి వివేక్

image

జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమర్రి పట్టణ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్ అని విమర్శించారు. ఆయన నాయకత్వంలో పనిచేయాలో లేదో హరీష్ రావు తేల్చుకోవాలని సూచించారు.

News November 15, 2025

బిహార్ రిజల్ట్స్: 5 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎం 5 స్థానాల్లో విజయం సాధించింది. జోకిహట్, బహదుర్గంజ్, కొచ్చదామన్, అమౌర్, బైసీ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అభ్యర్థులందరికీ 20వేలకు పైగా మెజార్టీ రావడం గమనార్హం. 2020 ఎన్నికల్లో ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి అదనంగా బహదుర్గంజ్ స్థానంలో గెలవడం విశేషం. ఎంఐఎం ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసింది.

News November 15, 2025

కామారెడ్డి: పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు

image

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫీజు చెల్లింపు గ‌డువును పొడిగించినట్లు కామారెడ్డి DEO రాజు తెలిపారు. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ప‌రీక్షా ఫీజు చెల్లించవచ్చ‌ని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.50తో ఈ నెల 21 నుంచి 29 వరకు ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. రూ.200 లేట్‌ ఫీజుతో DEC 2 నుంచి 11 వరకు, రూ.500 లేట్‌ ఫీజుతో DEC 15 నుంచి 29 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.