News January 24, 2025
అనకాపల్లి: లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయింపు

అనకాపల్లి జిల్లాలో కల్లుగీత కులాల వారికి లాటరీ ద్వారా 15 మద్యం దుకాణాలను కేటాయించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. 2024-26కు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించి షాపులను కేటాయించామన్నారు.
Similar News
News November 8, 2025
నేడు సంకటహర చతుర్థి

ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత, కృష్ణ పక్షంలో నాల్గవ తిథిని సంకటహర చతుర్థి అని అంటారు. ఈ రోజు విఘ్ననాయకుడైన గణపతికి అత్యంత ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి, నిండు మనస్సుతో గణనాథుడిని పూజిస్తారు. ఇలా చేస్తే జీవితంలో సంకటాలు, ఆటంకాలు తొలగిపోయి, శుభాలు కలుగుతాయని వేద పండితులు చెబుతారు. సంకటహర వ్రతాన్ని నేడు ఆచరించడం వలన అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయని నమ్మకం.
News November 8, 2025
వంగ, బెండ సాగు-తొలిదశలో చీడపీడల నివారణ

వంగ, బెండ మొక్కలపై తొలి దశలో అక్షింతల పురుగు, పెంకు పురుగులను గమనిస్తే ఏరి చంపేయాలి. కొమ్మతొలుచు పురుగు ఆశించిన రెమ్మలను కింది వరకు తుంచి నాశనం చేయాలి. పంట కాపునకు ముందు దశలో పురుగుల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిపాస్, 2.5ml క్వినాల్‌ఫాస్, 2ml ప్రొఫెనోఫాస్ మందులలో ఏదో ఒకదానిని 5ml వేపమందుతో కలిపి స్ప్రే చేయాలి. అవసరాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మందు మార్చి మరోసారి స్ప్రే చేయవచ్చు.
News November 8, 2025
భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

2018 నవంబర్ 18న భార్య లక్ష్మీ దేవిని గొంతు నులిమి చంపిన కేసులో కర్నూలు శివప్ప నగర్‌కు చెందిన ముద్దాయి శ్రీనివాసులుకు జీవిత ఖైదు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. ముద్దాయి 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా ఉన్నాడు. 2007లో లక్ష్మీదేవిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీనివాసులు అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


