News March 28, 2025
అనకాపల్లి: వచ్చే నెల 1న సాంఘిక శాస్త్రం పరీక్ష

పదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీన రంజాన్ పండగ సందర్భాన్ని పురస్కరించుకుని పరీక్షను 1వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.
Similar News
News March 31, 2025
రోహిత్ బౌలర్‌గా నా దగ్గరికొచ్చాడు: చిన్ననాటి కోచ్

రోహిత్ శర్మ గురించి అతని చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. హిట్ మ్యాన్ 12 ఏళ్ల వయసులో బౌలర్‌గా తన వద్దకు వచ్చాడని, తర్వాత బ్యాటర్‌గా మార్చానని తెలిపారు. ఇప్పుడు టీమ్ ఇండియా కెప్టెన్‌గా టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. 2023లో వన్డే వరల్డ్ కప్ మిస్ అయ్యిందని, తర్వాతి WCలో గెలిచి కలను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
News March 31, 2025
పాలమూరు: ఒకే వేదికపై మూడు పార్టీల నేతలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకే వేదికపై మూడు పార్టీల నేతలు కలిశారు. సోమవారం నారాయణపేట జిల్లాలో రంజాన్ పండుగా సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, బీజేపీ నేత నాగురావు నామాజీలు రంజాన్ వేడుకలో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
News March 31, 2025
సీఎస్కేపై సెహ్వాగ్ విమర్శలు

రాజస్థాన్‌తో సీఎస్కే ఓటమి అనంతరం మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆ జట్టుపై విమర్శలు గుప్పించారు. ‘క్రీజులో ఎంత పేరున్న ఆటగాడున్నా 2 ఓవర్లలో 40 పరుగులు చేయడమనేది కష్టమైనపని. ఏదో ఒకట్రెండు సార్లు మాత్రమే అది సాధ్యం. అక్షర్, పఠాన్ బౌలింగ్‌లో ధోనీ అప్పుడెప్పుడో 2సార్లు ఛేజ్ చేశారు. అలాంటివి తరచూ జరగవు. నాకు తెలిసి గడచిన ఐదేళ్లలో సీఎస్కే 180కి పైగా పరుగుల్ని ఎప్పుడూ ఛేదించలేదు’ అని పేర్కొన్నారు.