News September 5, 2025

అనకాపల్లి: ‘విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి’

image

విద్యార్థులను ఉపాధ్యాయులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి శంకరన్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారికి అవార్డులు అందజేసి సత్కరించారు. మంత్రి లోకేశ్ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి పిల్లల భవిష్యత్తుకు బాట వేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News September 5, 2025

కామారెడ్డి: 300 మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలతో నిఘా

image

కామారెడ్డిలో గణేశ్ నిమజ్జన, శోభాయాత్రల కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SP రాజేశ్ చంద్ర తెలిపారు. 300 మంది పోలీసులు, 120 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, నిమజ్జన ఘాట్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని SP కోరారు.

News September 5, 2025

మెదక్: నిమజ్జనంలో విషాదం.. యువకుడు మృతి

image

హవేలీఘనపూర్ మండలం తొగిట గ్రామంలో గణేశ్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. వినాయకుడి నిమజ్జనం కోసం చెరువులోకి దిగిన ఓ యువకుడు నీట మునిగి మరణించాడు. గ్రామానికి చెందిన మొండి ప్రభాకర్ కుమారుడు సుధాకర్(17) శుక్రవారం సాయంత్రం రామస్వామి కుంట వద్ద నిమజ్జనం అనంతరం కనిపించకుండా పోయాడు. నిర్వాహకులు, గ్రామస్థులు వెతకగా, అతని మృతదేహం బయటపడింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News September 5, 2025

హైదరాబాద్ వల్లే తెలంగాణ నంబర్‌వన్: చంద్రబాబు

image

AP: ఎంతో ఇష్టంతో తాను HYDను అభివృద్ధి చేశానని, దాని వల్లే TG నంబర్‌వన్‌గా నిలిచిందని CM చంద్రబాబు అన్నారు. అలాగే దేశంలో ఏపీని నంబర్‌వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో జరుగుతున్న టీచర్స్ డే కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్‌వన్‌గా నిలవాలి. రాబోయే 22 ఏళ్లపాటు మనమంతా దీనిపై దృష్టి సారిస్తే సాధ్యమే. విజన్ 2047 కోసం శ్రమిద్దాం’ అని ఆయన పిలుపునిచ్చారు.