News March 21, 2025
అనకాపల్లి: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ వివరాలను కలెక్టర్ వివరించారు. నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ పూర్ణిమాదేవి పాల్గొన్నారు.
Similar News
News March 28, 2025
ఏప్రిల్ నాలుగో తేదీ వరకు పెన్షన్ల పంపిణీ

నల్గొండ జిల్లాలో ఆసరా పింఛన్లను ఏప్రిల్ 4వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో శేఖర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లు గీత, ఒంటరి మహిళలకు పింఛన్లను ఆయా పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్లు తెలిపారు. పెన్షన్ పొందుటకు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
News March 28, 2025
యాత్రలు విద్యార్థుల అభివృద్ధికి దోహదం చేస్తాయి: కలెక్టర్

బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులకు విజ్ఞాన శాస్త్ర యాత్రను బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజ్ఞాన విహారయాత్రలు విద్యార్థుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. పాఠశాలలో కార్యక్రమాలకు భిన్నంగా విజ్ఞాన యాత్రలు విజ్ఞానాన్ని, వినోదాన్ని కలిగిస్తాయని అన్నారు.
News March 28, 2025
భద్రాద్రి రాముడికి పోచంపల్లి పట్టు వస్త్రాలు

భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పోచంపల్లి పట్టు వస్త్రాలు తయారవుతున్నాయి. ఎస్ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు దోర్నాల శ్రీనాథ్, ఇంజమూరి యాదగిరి, ఆడేపు ఆంజనేయులు, కడవేరు చంద్రశేఖర్ భద్రాచలంలోని భక్త రామదాసు ధ్యాన నిలయంలో ఏర్పాటు చేసిన మగ్గాలపై పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు, పట్టు పంచలనేస్తున్నారు.