News May 6, 2024

అనకాపల్లి సభలో సీఎం రమేశ్ ఏమన్నారంటే!

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లిలో జరిగిన సభలో సీఎం రమేశ్ కూటమి మేనిఫెస్టో గురించి వివరించారు. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ. 2 వేలు చేసింది చంద్రబాబు కాదా అని గుర్తు చేశారు. ఒక్కో ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామన్నారు. బస్సు సౌకర్యాన్ని కూడా ఉచితంగా అందిస్తామని వివరించారు.

Similar News

News January 24, 2025

విశాఖలో కిడ్నాప్ కలకలం

image

విశాఖలో కిడ్నాప్ కలకలం రేపింది. ఓ యువతి పెద్దపాలెం చెందిన రామారావు అనే వ్యక్తికి పలుమార్లు ఫోన్ చేసి ట్రాప్ చేసింది. తగరపువలస సమీపంలో గుడి వద్దకు రావాలని చెప్పడంతో ఆయన వెళ్ళగా నలుగురు యువకులు కిడ్నాప్ చేసి ATM కార్డు, రూ.48,000 నగదు దోపిడీ చేశారు. ఏటీఎంలో రూ.7వేలు డ్రా చేయడంతో రామారావు మోసపోయినట్లు గ్రహించి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రాప్ చేసిన యువతి ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నారు.

News January 24, 2025

పాయకరావుపేటలో ఎయిర్ పోర్ట్‌కు ప్రతిపాదనలు

image

పాయకరావుపేటలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ముందు తుని-అన్నవరం మధ్య ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ ప్రాంతం అనుకూలం కాదని ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు సమాచారం. పాయకరావుపేట ప్రాంతంలో విస్తారంగా ప్రభుత్వ భూములు ఉండడంతో నిర్మాణానికి అన్ని విధాల అనుకూలమని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు భూముల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

News January 24, 2025

విశాఖ పోలీసుల అదుపులో నకిలీ మహిళా ఐఏఎస్..!

image

ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు వద్ద డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ మహిళాIASతో పాటు ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అమృత భాగ్యరేఖ అనే మహిళ MVPకాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చి విశాఖCPకి ఫిర్యాదు చేశారు. సీపీ ఆదేశాలతో పోలీసులు విచారించగా ఆమె నకిలీ IASగా నిర్ధారణ అయింది.