News March 10, 2025

అనకాపల్లి: సమస్యలను సత్వర పరిష్కరించాలి

image

సమస్యలను సత్వర పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశించారు. సోమవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు 31 ఫిర్యాదులను అందజేశారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News November 5, 2025

బాపట్లలో కారు, బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

బాపట్ల పట్టణంలోని మరుప్రోలు వారి పాలెం గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై బుధవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలపాలై సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 5, 2025

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఎస్పీ

image

ప్రొద్దుటూరులో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో ఫేక్ కరెంట్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.6.28 లక్షల నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

News November 5, 2025

VZM: దివ్యాంగులకు సబ్సిడీతో రిట్రోఫిటేడ్ మోటరైజ్డ్ వాహనాలు

image

దివ్యాంగులకు 100% సబ్సిడీతో ప్రభుత్వం రిట్రోఫిటేడ్ మోటరైజ్డ్ వాహనాలను మంజూరు చేయనుందని జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు ఆశయ్య బుధవారం తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 25వ తేదీ లోగా www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వయస్సు 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం 70% లోయర్ లింబ్ దివ్యాంగత కలిగి ఉండాలని, వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలన్నారు.