News April 4, 2025
అనకాపల్లి: ‘సెలవులను పక్కాగా అమలు చేయాలి’

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అనకాపల్లి జిల్లాలో ఒంటి పూట సెలవులను పక్కాగా అమలు చేయాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పలు ప్రైవేట్ పాఠశాలలో 9,10వ తరగతి విద్యార్థులకు రెండు పూటలా క్లాసులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 11, 2025
2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం: మోదీ

2036 ఒలింపిక్స్ భారత్‌లో జరిగేలా ప్రయత్నం చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో విశ్వక్రీడలు నిర్వహిస్తే భారత్ ఖ్యాతి పెరుగుతుందని ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేలా వారణాసి యువత నేటి నుంచే శిక్షణ ప్రారంభించాలని కోరారు. గతంతో పోల్చితే కాశీ చాలా అభివృద్ధి చెందిందని, హెల్త్ క్యాపిటల్‌గా మారిందన్నారు. వారణాసిలో పలు అభివృద్ధి పనులకు నేడు మోదీ శంకుస్థాపన చేశారు.
News April 11, 2025
పోలీసుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ‘పోలీసు వెల్ఫేర్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.
News April 11, 2025
కోనో కార్పస్ చెట్ల నరికివేత షురూ

TG: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోనో కార్పస్ చెట్ల నరికివేత ప్రక్రియను GHMC అధికారులు ప్రారంభించారు. ఈ చెట్ల పుప్పొడి రేణువులతో ప్రమాదం ఉంటుందని, ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెప్పడంతో వాటిని తొలగిస్తున్నారు. కోనో కార్పస్ చెట్లను నరికేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి సూచించారు. అలాగే జిల్లాల్లో ఉన్న ఈ చెట్లనూ తొలగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.