News November 1, 2025
అనకాపల్లి: సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనకు ఇద్దరు విద్యార్థులు

ఢిల్లీలో ఈనెల 6వ తేదీ నుంచి జరిగే సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపికయ్యారు. ఏపీ సమగ్ర శిక్ష సైన్స్ సిటీ సౌజన్యంతో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 52 మంది విద్యార్థులు ఎంపిక కాగా.. జిల్లా నుంచి నక్కపల్లి జడ్పీ హైస్కూల్‌కు చెందిన చంద్రగిరి రేణుకాదేవి, అదేవిధంగా కింతలి జడ్పీ హైస్కూల్లో చదువుతున్న కొఠారి లిఖిత ఎంపికయ్యారు.
Similar News
News November 2, 2025
కొనసాగుతున్న కరీంనగర్ అర్బన్ ఎన్నికల కౌంటింగ్

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 12 డైరెక్టర్ స్థానాలకు 54 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పటిష్ట భద్రతా మధ్య కౌంటింగ్ కొనసాగుతుంది. అధికారులు పారదర్శకంగా లెక్కింపు చేపడుతున్నారు.
News November 2, 2025
జానపద కళాకారుల సంక్షేమంపై కవిత హామీ

జానపద కళాకారుల సంక్షేమంపై కరీంనగర్‌లో జరిగిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. కళాకారులను ప్రభుత్వం గుర్తించి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వారికి వేతనాలు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. జానపద సంప్రదాయాన్ని నిలబెట్టిన కళాకారులకు కళాభివందనం చేసిన కవిత, హక్కుల కోసం అందరూ కలిసి పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
News November 2, 2025
తిమ్మాపూర్: 41 ఏండ్ల సర్వీస్.. స్కూల్ అసిస్టెంట్‌కు ఘన సన్మానం

తిమ్మాపూర్ మండలం పొలంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 41 ఏండ్ల 8 నెలల సుదీర్ఘ సేవలు అందించిన ఎస్ఏ (సోషల్) టి. రమేష్ కుమార్ దంపతులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి వంగల శ్రీనివాస్, రమేష్ కుమార్ సేవలు ఆదర్శనీయమని ప్రశంసించారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేసి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.


