News December 19, 2025
అనకాపల్లి: 14,559 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక

అనకాపల్లి జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో 14,559 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికను సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి శుక్రవారం తెలిపారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 8,824 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 7,898 టన్నుల యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెలాఖరులోగా మరో 926 టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు చెప్పారు. నానో ఎరువులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
Similar News
News December 24, 2025
KMR: సైబర్ బాధితులకు రూ.1.07 కోట్లు వాపస్!

కామారెడ్డి జిల్లాలో గతేడాది జిల్లాలో 200 సైబర్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 160కి తగ్గింది. ముఖ్యంగా, సైబర్ మోసాలకు గురైన బాధితులకు లోక్ అదాలత్, కోర్టు ఉత్తర్వుల ద్వారా రూ.1,07,31,518 విలువైన సొత్తును తిరిగి ఇప్పించడం విశేషం. 2024లో 35 NDPS కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 23కి తగ్గింది. నిరంతర నిఘా, కఠిన తనిఖీలు చేపట్టడం ద్వారా జిల్లాలో గంజాయి సరఫరాను అడ్డుకోగలిగారు.
News December 24, 2025
కామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు..

కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన పటిష్టమైన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిబంధనల అమలు వల్ల ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 262 మంది మృతి చెందగా, 263 మంది గాయపడ్డారు. 2025లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 200 మంది మృతి చెందగా, 242 మంది గాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే మరణాల సంఖ్యలోనూ, సాధారణ ప్రమాదాల సంఖ్యలోనూ పెద్ద ఎత్తున తగ్గుదల కనిపించడం గమనార్హం.
News December 24, 2025
కామారెడ్డి జిల్లాలో తగ్గిన మహిళా సంబంధిత నేరాలు

కామారెడ్డి జిల్లాలో మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. SP రాజేష్ చంద్ర అందించిన వార్షిక నివేదిక ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈఏడాది మహిళా సంబంధిత నేరాలు తగ్గాయి. 2024లో 622 కేసులు నమోదు కాగా, 2025లో ఆ సంఖ్య 585కి తగ్గింది. ఈ ఏడాది 16 హత్యలు, 2 వరకట్న మరణాలు, 67 రేప్ కేసులు నమోదయ్యాయి. అలాగే గృహ హింస కారణంగా 2 ఆత్మహత్యలు, 247 గృహ హింస కేసులు, 109 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.


