News January 1, 2026

అనకాపల్లి: 15 మండలాల్లో క్రీడా మైదానాల నిర్మాణానికి నిధులు

image

అనకాపల్లి జిల్లాలో 15 మండలాల్లో క్రీడా మైదానాల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు జిల్లా క్రీడల శాఖ అధికారిణి పూజారి శైలజ తెలిపారు. బుధవారం నాతవరంలో ఆమె మాట్లాడారు. 14 మండలాల్లో క్రీడామైదానాల నిర్మాణ పనులు ప్రారంభం అయినట్లు శైలజ చెప్పారు. కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ స్థల వివాదం కోర్టులో ఉండడంతో అక్కడ పనులు చేపట్టలేదని అన్నారు. విద్యార్థులు క్రీడలు పట్ల ఆసక్తి చూపించాలన్నారు.

Similar News

News January 2, 2026

సంగారెడ్డి: వైద్య విద్యార్థుల కోసం దంపతుల దేహదానం

image

సంగారెడ్డి పట్టణానికి చెందిన కళింగ కృష్ణ కుమార్ జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా, ఆయన భార్య ఆశా జ్యోతి రాయికోడ్ మండలంలో తహశీల్దారుగా పని చేస్తున్నారు. కాగా, తమ మరణాంతరం దేహాలను దానం చేసేందుకు ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచారు. శరీరాన్ని దహనం లేదా ఖననం వంటి సాంప్రదాయలకు పరిమితం చేయకుండా వైద్య విద్యార్థుల పరిశోధనకు సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు.

News January 2, 2026

మేడారం జాతరపై వైద్యాధికారుల సమీక్ష

image

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో వైద్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల డీఎంహెచ్వోలు, సూపరింటెండెంట్లు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారులు సమావేశమయ్యారు. ఎంజీఎంలో సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన సమీక్ష జరిపారు. ప్రభుత్వ వైద్యశాలలోని స్పెషలిస్ట్ వైద్యులను నియమించుకోవాలని నిర్ణయించారు. వైద్య సిబ్బంది, టెక్నీషియన్లను పూర్తి స్థాయిలో డిప్యూట్ చేసుకోవాలన్నారు.

News January 2, 2026

న్యూ ఇయర్ సంబరాలు.. కడప జిల్లాలో ఎంత తాగారంటే.!

image

*కడపలో రూ.1.74 కోట్లు (మద్యం1988, బీరు 1108 కేసులు)
*ప్రొద్దుటూరు రూ.1.63 కోట్లు (2164-910 కేసులు)
*బద్వేల్ రూ.86.09 లక్షలు (1152-364 కేసులు)
*జమ్మలమడుగు రూ.40.90 లక్షలు (611-130)
*ముద్దనూరు రూ.40.73 లక్షలు (566-268)
*మైదుకూరు రూ.79.97 లక్షలు (1187-417)
*పులివెందుల రూ.81.18 లక్షలు (1130-481 కేసులు)
*సిద్దవటం రూ.13.84 లక్షలు (214-82)
*ఎర్రగుంట్ల రూ.43.23 లక్షలు (645-230 కేసులు తాగారు.