News January 1, 2026
అనకాపల్లి: 15,173 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

అనకాపల్లి జిల్లాలో 35 వేల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి బుధవారం తెలిపారు. ఇప్పటివరకు 15,173 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. రబీలో పంటల విస్తీర్ణం సాధారణ విస్తీర్ణం కన్నా 4 వేల హెక్టార్ల మేర పెరిగే అవకాశం ఉందన్నారు. పంటలకు ఎరువులు పురుగు మందులు పిచికారీ చేసేందుకు 20 డ్రోన్లను అందుబాటులో ఉంచామన్నారు.
Similar News
News January 9, 2026
కుబేర యోగం ఉంటే ఏం జరుగుతుంది?

కుబేర యోగం ఉన్నవారికి అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది. వీరు ఏ వ్యాపారం చేపట్టినా అందులో భారీ లాభాలు గడిస్తారు. చిన్న వయసులోనే సొంత ఇల్లు, వాహనాలు, విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. వీరికి పూర్వీకుల ఆస్తి కలిసి రావడమే కాకుండా, లాటరీ లేదా షేర్ మార్కెట్ వంటి మార్గాల ద్వారా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు అనేవి వీరి జీవితంలో ఉండవు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి.
News January 9, 2026
ఈనెల 14న ఉమ్మడి ప్రకాశం జిల్లా షటిల్ టోర్నమెంట్

పర్చూరులోని NTR క్రీడా వికాస కేంద్రంలో ఈ నెల 14న మెన్ డబుల్స్ షటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ సమీవుల్లా తెలిపారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. విజేతలకు 1వ బహుమతిగా రూ.15,116లు, 2వ బహుమతి రూ.10,116లు, 3వ బహుమతి రూ.5,116లు, 4వ బహుమతి రూ.3,116లగా నిర్ణయించినట్లు చెప్పారు. వివరాలకు స్టేడియం నిర్వాహకులను సంప్రదించాలన్నారు.
News January 9, 2026
విజయవాడ: ముగిసిన దుర్గగుడి పవర్ కట్ వివాదం

విజయవాడ దుర్గగుడి పవర్ కట్ వివాదానికి మంత్రుల జోక్యంతో తెరపడింది. ఆలయానికి విద్యుత్ కోత వివాదంపై మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, ఆనం రాంనారాయణ రెడ్డి దేవాదయశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యుత్, దేవదాయ శాఖలు కలిసి సమన్వయంతో పనిచేసుకోవాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. భక్తుల సెంటిమెంటు అంశాల విషయంలో తొందరపాటు చర్యలు వద్దని స్పష్టం చేశారు.


