News December 18, 2025
అనకాపల్లి: 19న రాష్ట్రస్థాయి బీచ్ గేమ్స్‌కు ఎంపిక పోటీలు

రాష్ట్రస్థాయి బీచ్ గేమ్స్‌కు ఎంపిక పోటీలు ఈనెల 19న విజయవాడ కృష్ణా నది ఒడ్డున నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిణి పూజారి శైలజ తెలిపారు. ఖేలో ఇండియా-2వ విడతలో పురుషులు, మహిళల ఓపెన్ క్యాటగిరి విభాగంలో కబాడీ, వాలీబాల్, సెపక్ తక్ర పోటీలు జరుగుతాయని అన్నారు. విజేతలు జనవరి 5 నుంచి 10 వరకు దాదర్ & నగర్ హవేలీ, డామన్ & డయ్యూలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
Similar News
News December 19, 2025
తెలంగాణ ఫుట్‌బాల్ జట్టుకు సిద్దిపేట బిడ్డ

జాతీయ స్థాయి సంతోష్ ట్రోఫీలో తలపడే తెలంగాణ ఫుట్‌బాల్ జట్టుకు సిద్దిపేట వాసి సాయి యశ్వంత్ ఎంపికయ్యాడు. యశ్వంత్ సిద్దిపేటలోనే ఫుట్‌బాల్‌లో ఓనమాలు నేర్చుకుని, ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. యశ్వంత్ ప్రతిభను గుర్తించి రాష్ట్ర జట్టులోకి తీసుకోవడంపై టీఎఫ్‌ఏ సెక్రటరీ ఫాల్గుణ, కోచ్ అక్బర్ నవాబ్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా క్రీడాకారుడు జాతీయ జట్టుకు ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News December 19, 2025
విశాఖ రుషికొండ బిల్డింగ్‌పై జగన్ ఏమన్నారంటే?

AP: మెడికల్ కాలేజీల అంశంపై గవర్నర్‌ను కలిసిన అనంతరం YCP చీఫ్ జగన్ విశాఖ రుషికొండ నిర్మాణాలపై స్పందించారు. ‘మా హయాంలో రుషికొండపై రూ.230CRతో బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మిస్తే, అది ఇప్పుడు నగరానికే తలమానికమైంది. అయినా దానిపై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. విశాఖలో ఒకరోజు యోగా డే కోసం అంతకంటే ఎక్కువే ఖర్చు చేశారు. మ్యాట్లు మొదలు మిగిలిన సామగ్రి కొనుగోలులోనూ అవినీతికి పాల్పడ్డారు’ అని ఆరోపించారు.
News December 19, 2025
డిసెంబర్ 19: చరిత్రలో ఈరోజు

* 1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుపై అప్పటి PM నెహ్రూ ప్రకటన
* 1961: పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి కల్పించిన భారత సైన్యం
* 1974: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ జననం
2015: సినీ నటుడు, కవి రంగనాథ్ మరణం(ఫొటోలో)
– గోవా విముక్తి దినోత్సవం


