News March 26, 2025

అనకాపల్లి: 208 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన పదవ తరగతి ఫిజికల్ సైన్స్ పరీక్షకు 208 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది హాజరు కావాల్సి ఉండగా 20,673 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 766 మంది హాజరు కావలసి ఉండగా 659 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News September 15, 2025

సిరిసిల్ల: ‘పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి’

image

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు సోమవారం వినతిపత్రం అందించారు. అనంతరం గణేష్ మాట్లాడుతూ.. తెలంగాణలోనే పెద్ద పండుగలు అయిన బతుకమ్మ, దసరా వస్తున్నందున కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. పండుగ రోజు డబ్బులు లేక వాళ్ళు ఇబ్బందులు పడతారన్నారు.

News September 15, 2025

PGRS ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత: ఎస్పీ కృష్ణరావు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన ఫిర్యాదులను మొదటి ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో ఆయన ప్రజల నుంచి 127 ఫిర్యాదులను స్వీకరించారు. ఆస్తి, ఆర్థిక, కుటుంబ సమస్యలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

News September 15, 2025

సిరిసిల్ల: ప్రజావాణిలో 185 దరఖాస్తుల స్వీకరణ

image

ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలేక్టరేట్‌లో ఆయన ప్రజల నుంచి మొత్తం 185 దరఖాస్తులను స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు 61, డీఆర్డీఏకు 44, హౌసింగ్‌కు 25, ఉపాధి కల్పన కార్యాలయం, ఎన్డీసీలకు 8 చొప్పున, విద్యా శాఖ, జిల్లా పంచాయతీ కార్యాలయానికి 6 చొప్పున దరఖాస్తులు అందాయి.