News April 4, 2025

అనకాపల్లి: 3 చోట్ల టెన్త్ పరీక్షా పేపర్ల మూల్యాంకనం

image

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి మూల్యాంకనం ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు తెలిపారు. అనకాపల్లి పట్టణంలో వేల్పుల వీధి టౌన్ బాలికోన్నత పాఠశాల, గవరపాలెం చిన్న హైస్కూల్, ఏఎంఎల్ హైస్కూల్లో మూల్యాంకనం జరుగుతున్నట్లు తెలిపారు. మూల్యాంకనం జరిగే స్కూల్స్ వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News February 28, 2026

అమెరికాVsఇరాన్.. ఎవరి బలం ఎంత?

image

☛ డిఫెన్స్ బడ్జెట్: USA $895B, ఇరాన్ $15.4B
☛ యాక్టివ్ మిలిటరీ సిబ్బంది: USA 13.28L, ఇరాన్ 6.10L
☛ రిజర్వ్ మిలిటరీ: USA 7.99L, Iran 3.5L
☛ ఎయిర్‌క్రాఫ్ట్ ఫైటర్స్: USA 1,790, Iran:188
☛ న్యూక్లియర్ వార్ హెడ్స్: USA: 5,244, Iran: 0
☛ అటాక్ హెలికాప్టర్లు: USA: 1,002, Iran: 13
☛ ట్యాంక్స్: USA: 4,640, Iran: 1,713
☛ సబ్‌మెరైన్స్: USA: 70, Iran: 25

News February 28, 2026

గోదావరి నది వెంట ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయాలి: అడ్లూరి

image

గోదావరి నది వెంట ఉన్న ఆలయాలను ఆగమ శాస్త్ర పరంగా అభివృద్ధి చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ సూచించారు. గత పుష్కరాలకు భిన్నంగా అభివృద్ధి పనులు చేయాలని, వెహికల్ పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కనురెప్పపాటు కరెంటు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు.

News February 28, 2026

వేట్లపాలెం ఘటనపై లోకేశ్ దిగ్భ్రాంతి

image

వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం జరిగిన పేలుడు ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు మృత్యువాత పడటం కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన, బాధిత కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.