News September 17, 2025

అనకాపల్లి: 30 రోజుల్లో 14,86,513 మహిళలు ఉచిత ప్రయాణం

image

స్త్రీ శక్తి పథకం కింద అనకాపల్లి జిల్లాలో గల నర్సీపట్నం, అనకాపల్లి డిపోల నుంచి నడుస్తున్న బస్సుల్లో నెల రోజుల్లో 14,86,513 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి వి.ప్రవీణ తెలిపారు. ఈ మేరకు మహిళలు రూ.5.35 కోట్ల మేర లబ్ధి పొందినట్లు పేర్కొన్నారు. ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగిందన్నారు. అనకాపల్లి డిపోలో 100% ఓఆర్ నమోదు అయిందన్నారు.

Similar News

News September 17, 2025

కామారెడ్డి జిల్లాలో వర్షపాతం UPDATE

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ఇసాయిపేట 50 MM, సదాశివనగర్ 48.5, రామలక్ష్మణపల్లి 42.3, హాసన్ పల్లి 34.3, తాడ్వాయి 25.5, పాత రాజంపేట 24.3, మాచాపూర్ 24, లింగంపేట 21.3, IDOC(కామారెడ్డి) 15, భిక్కనూర్ 14.3, నాగిరెడ్డి పేట 8.3, పిట్లం 7, వెల్పుగొండ 5, రామారెడ్డి 4.3, బీబీపేట 4, గాంధారి, లచ్చపేటలో 3.5 MM వర్షపాతం రికార్డయ్యింది.

News September 17, 2025

బైరాన్‌పల్లి రక్షక దళాల పోరాటం మరువలేనిది..!

image

వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన బైరాన్‌పల్లి గ్రామం రక్షక దళాల పోరాటం మరువలేనిది. ఇమ్మడి రాజిరెడ్డి, జగ్గం హనుమంతు, చల్లా నర్సిరెడ్డి, పోశాలు తోటరాములు, రాంరెడ్డిల ఆధ్వర్యంలో రజాకార్లకు వ్యతిరేకంగా రక్షక దళం ఏర్పాటు చేసి బురుజుపై గస్తీదళ సభ్యులను నియమించారు. స్వాతంత్ర్యం వచ్చిన 12 రోజులకే ఆగస్టు 27న అర్ధరాత్రి బైరాన్‌పల్లి గ్రామంపై రజాకార్లు విరుచుకుపడి 84 మందిని నిలబెట్టి కాల్చి చంపారు.

News September 17, 2025

రాయలసీమ రుచుల రారాజు ‘చెనిక్కాయ’

image

రాయలసీమకు చెనిక్కాయలకు విడదీయని సంబంధం ఉంది. వాటితో చేసే చెనిక్కాయల పొడి, ఉరిమిండి, ఉడికేసిన చెనిక్కాయలు, పాగం పప్పు వంటి వంటకాలు మన సీమ ప్రత్యేకం. చెనక్కాయకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం 7వేల ఏళ్ల క్రితమే దక్షిణ అమెరికాలో మొదలైన సాగు తర్వాత భారత ఉపఖండానికి వ్యాపించింది. చెనక్కాయల సాగులో దేశంలో ఏపీ టాప్‌లో ఉండగా అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో రాష్ట్రంలోనే అధికంగా సాగుచేస్తారు.