News October 28, 2025
అనకాపల్లి: ‘50% సబ్సిడీపై పశువుల దాణా పంపిణీకి సిద్ధం’

అనకాపల్లి జిల్లాలో 50% సబ్సిడీతో పంపిణీ చేసేందుకు 860 మెట్రిక్ టన్నుల పశువుల దాణా సిద్ధంగా ఉందని జిల్లా పశు వైద్యాధికారి బి.రామ్మోహన్రావు తెలిపారు. మంగళవారం మాకవరపాలెంలో ఆయన మాట్లాడారు. తుఫాను కారణంగా పశువులకు మేత ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇప్పటికే పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, అచ్యుతాపురం, పరవాడ, రాంబిల్లి మండలాల్లో 40 మెట్రిక్ టన్నులు సబ్సిడీపై అందజేశామన్నారు.
Similar News
News October 28, 2025
ALLERT: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ‘మొంథా తుఫాన్’

మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. శిథిలావస్థ భవనాలు, పాఠశాలల్లో ఎవరూ లేకుండా చూడాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, తీగల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ అధికారులు సూచించారు.
News October 28, 2025
కామారెడ్డి: పోలీసుల నిర్లక్ష్యం.. సస్పెన్షన్

పాస్‌పోర్ట్ విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం సస్పెండ్ చేసినట్లు తెలిపారు. డీఎస్‌బీ విభాగంలో పనిచేసిన భిక్నూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎఎస్‌ఐ నర్సయ్య, రామారెడ్డి స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిపై ఇన్‌ఛార్జ్ డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతారాహిత్యానికి పోలీసు శాఖలో స్థానం లేదని ఎస్పీ తెలిపారు.
News October 28, 2025
రెటినోపతి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు: కలెక్టర్

వనపర్తి జిల్లాలో ఏ ఒక్కరూ రెటినోపతి భారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు సూచించారు. జిల్లా మెడికల్ కళాశాల ఆప్తల్ మాలజీ విభాగం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. నవంబర్ 14 నుంచి వంద రోజుల వైద్య పరీక్షల కార్యాచరణ ప్రక్రియ ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.


