News December 3, 2025

అనకాపల్లి: ‘8,000 కుటుంబాలకు వంద రోజులు పని కల్పించాలి’

image

ఉపాధి హామీ పథకానికి సంబంధించి జిల్లాలో డిసెంబర్ 13వ తేదీ నాటికి 8,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం అనకాపల్లి కలెక్టరేట్ అధికారులతో ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. నిర్మాణంలో ఉన్న మ్యాజిక్ డ్రెయిన్లు, కంపోస్ట్ పిట్స్, క్యాటిల్ షెడ్స్ పనులను వారం రోజులు లోగా పూర్తి చేయాలన్నారు. నీటి కుంటల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 3, 2025

వనపర్తి: నిన్న ఒక్కరోజే 1,608 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలు

image

వనపర్తి జిల్లాలో రెండో విడతలో జరగనున్న 94 గ్రామ పంచాయతీల్లోని 850 వార్డులకు నిన్న ఒక్కరోజే 1,608 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మండలాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
✓ ఆత్మకూర్ మండలం – 250
✓ అమరచింత మండలం – 216
✓ కొత్తకోట మండలం – 392
✓ మదనాపూర్ మండలం – 299
✓ వనపర్తి మండలం – 451 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా మొత్తం వార్డు సభ్యుల నామినేషన్ల సంఖ్య 2,062కు చేరింది.

News December 3, 2025

వనపర్తి: నిన్న ఒక్కరోజే 442 సర్పంచ్ నామినేషన్లు దాఖలు..!

image

వనపర్తి జిల్లాలో రెండో విడతలో జరగనున్న 94 గ్రామ పంచాయతీలకు నిన్న ఒక్కరోజే 442 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ ఆత్మకూరు – 68 నామినేషన్లు.
✓ అమరచింత – 54 నామినేషన్లు.
✓ కొత్తకోట – 102 నామినేషన్లు.
✓ మదనాపురం – 82 నామినేషన్లు.
✓ వనపర్తి – 136 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు 741 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.

News December 3, 2025

భద్రాద్రి: ఆ గ్రామం ఎస్టీ రిజర్వ్‌డ్.. నామినేషన్లు నిల్

image

పాల్వంచ మండలంలోని పాండురంగాపురం పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీలకు రిజర్వు కాగా, నామినేషన్ల స్వీకరణకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ గ్రామంలో మొత్తం 1,202 మంది ఓటర్లు ఉన్నప్పటికీ, ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడమే ఇందుకు కారణం. సర్పంచ్‌తో పాటు 4 వార్డు స్థానాలు కూడా ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. వెంటనే రిజర్వేషన్లను మార్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.