News December 12, 2025
అనఘాష్టమి వ్రత విధానం

పూజా మందిరంలో పీఠంపై దత్తాత్రేయుడు చిత్రపటాన్ని పూలతో అలంకరించాలి. అష్టదళ పద్మం వేసి, దానిపై కలశం ఉంచి, ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. మొదట గణపతి పూజ చేయాలి. అనంతరం అనఘస్వామిని ఆరాధించాలి. పగటిపూట నిద్రించకూడదు. ఉపవాసం ఉండాలి. ‘ఓం దత్తాత్రేయాయ నమః’ అని స్మరించాలి. రాత్రిపూట సాత్వికాహారం తీసుకోవాలి. వ్రతం పూర్తయ్యాక దక్షిణ, తాంబూలం, వ్రత పుస్తకాలు ఇవ్వాలి. ఈ వ్రతం మహిళలు ఎవరైనా చేయవచ్చు.
Similar News
News December 12, 2025
బోయర్ జాతి మేకల ప్రత్యేకతలు ఇవే..

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తి, మాంసంలో కొవ్వు తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి సాధారణంగా తెల్లటి శరీరం, ఎర్రటి-గోధుమ రంగు తల, పొడవైన వంగి ఉండే చెవులు, వెనుకకు వంగిన బలమైన కొమ్ములు, పొట్టి కాళ్లు ఉంటాయి. మగ మేకలు ఏడాదిలో 70-80KGలు, రెండేళ్లలో 100KGలకుపైగా పెరుగుతాయి. ఇవి ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని, అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. మనదేశంలో చాలా మంది రైతులు వీటిని పెంచుతున్నారు.
News December 12, 2025
362 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 MTS పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్ అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టైర్ 1, టైర్ 2 రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.650, SC, ST, PwBDలకు రూ.550. వెబ్‌సైట్: https://www.mha.gov.in/లేదా https://www.ncs.gov.in/
News December 12, 2025
ఒకే జిల్లాలో 7,400 HIV కేసులు

బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో ఏకంగా 7,400 HIV కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 400 మంది చిన్నారులున్నారు. వీరికి తల్లిదండ్రుల ద్వారా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ జిల్లాలో ప్రతి నెలా 40-60 దాకా కేసులు నమోదవుతున్నాయని, ప్రస్తుతం 5వేల మందికి పైగా వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సరైన అవగాహన, టెస్టింగ్ లేకపోతే వ్యాధి మరింత వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


