News March 22, 2024
అనధికారిక లావాదేవీలపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలి: గుంటూరు కలెక్టర్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా అధిక మొత్తంలో జరిగే లావాదేవీల ఖాతాల వివరాలు ఎప్పటికప్పుడు అందించాలని జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎలక్షన్ కోడ్ అమలుపై బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షల ఖర్చుకు అనుమతి ఉందన్నారు.
Similar News
News February 22, 2026
నేడు గుంటూరుకు CMచంద్రబాబు రాక

గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బొమ్మిడాలనగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సొసైటీలో ఆదివారం ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అతిథులు తపాలా సేవా మూర్తులకు సన్మానం చేయనున్నారు.
News February 22, 2026
ఫిరంగిపురం: కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. యువకుడి మృతి

ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలోని రైస్ మిల్లు వద్ద శనివారం విషాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో ఓ యువకుడు మరణించాడు. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన బైక్‌పై వెళ్తుండగా రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రభుదాసు అక్కడికక్కడే మృతి చెందాడు.