News March 21, 2024
అనధికార ఆయుధాలు గుర్తిస్తే పిర్యాదు చెయ్యండి: ఎస్పీ

అనంతపురం జిల్లాలో అనధికారికంగా ఆయుధాలు వున్నట్లు తెలిస్తే 9440796800 లేదా పోలీసు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9392918293 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ అన్బురాజన్ కోరారు.
జిల్లాలో 703 మంది వద్ద 734 ఆయుధాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 654 ఆయుధాలు డిపాజిట్ చేసినట్లు తెలిపారు. 77 ఆయుధాలు బ్యాంక్ సెక్యూరిటీ దగ్గర ఉన్నాయన్నారు.3 మాత్రంమే డిపాజిట్ చేయాల్సి ఉందని వెల్లడించారు.
Similar News
News April 19, 2025
అమరాపురం: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

ఉమ్మడి అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని కాచికుంటకు చెందిన యువకుడు మంజునాథ్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాచికుంట గ్రామంలో ఓ రైతుకు చెందిన పొలంలో యువకుడు ట్రాక్టర్‌తో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఆ సమయంలో ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 19, 2025
కలెక్టర్& SPలతో సమావేశమైన మంత్రి భరత్

అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్‌ను జిల్లా కలెక్టర్ వినోద్, ఎస్పీ జగదీశ్ శుక్రవారం కలిశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి భరత్ గంటపాటు సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణలో జిల్లా ప్రభుత్వ అధికారుల పనితీరు బాగుందని మంత్రి కొనియాడారు.
News April 19, 2025
ATP: తాడిపత్రి ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పిస్తా – ఎంపీ

అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఉపకరణాలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు వై నారాయణరెడ్డి, మల్లికార్జున రెడ్డి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను శనివారం కలిశారు. అనంతపురంలోని ఎంపీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ రూ. కోటి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.