News March 28, 2025

అనపర్తి: కాలువలో పడి 4ఏళ్ల చిన్నారి మృతి

image

అనపర్తి మండలం కొప్పవరంలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. 4ఏళ్ల చిన్నారి అనూష భార్గవి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయింది. చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయిందని తండ్రి దొరబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇంటి పక్కనే పంట కాలువ ఉండడంతో ఆ కోణంలో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం పాప మృతదేహం లభించింది.

Similar News

News March 31, 2025

అర్ధరాత్రి కారు వీరంగం.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

రాజమండ్రి రూరల్ కొంతమూరులో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బాలాజీపేటకి చెందిన ఈర్లు నాగబాబు (44) ర్యాపిడో బైక్ టాక్సీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అర్ధరాత్రి బైక్ రైడ్‌లో ఉండగా మనీష్ ఫంక్షన్ హాల్ వద్ద మద్యం మత్తులో కారులో నలుగురు వేగంగా వచ్చి బైక్‌ని ఢీకొట్టారు. దీంతో నాగబాబుతో పాటు వెనక కూర్చున్న కస్టమర్ వీరబాబు(28) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

News March 31, 2025

రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి

image

బైక్‌పై రాజమండ్రిలోని అత్తారింటికి శుభకార్యానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాలు.. JRG(M) లక్కవరానికి చెందిన నాగేశ్వరరావు తన భార్య రమణమ్మ, కొడుకు షణ్ముఖ్, కుతూరు జాహ్నవితో కలిసి బైక్‌పై బయలుదేరారు. సీతంపేట వద్ద రోడ్డు అంచున ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో వీరనాగేశ్వరరావు మృతి చెందారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI చంద్రశేఖర్ తెలిపారు.

News March 31, 2025

రాజమండ్రి: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో బొమ్మూరు మురళీకొండకి చెందిన మట్టపల్లి విజయప్రకాశ్‌ (34) నిన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. విజయప్రకాశ్ అహ్మదాబాద్‌లో ఓఎన్‌జీసిలో ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి భోజనం చేసి గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆదివారం ఇంటికి ఆనుకుని ఉన్న వేపచెట్టుకు స్కార్ఫ్‌తో ఉరివేసుకున్నాడు. అతని భార్య షారోన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని SI తెలిపారు. 

error: Content is protected !!