News February 11, 2025
అనపర్తి: ప్రమాదవశాత్తు లిఫ్టు గుంతలో పడి వ్యక్తి మృతి

అనపర్తిలో ప్రమాదవశాత్తు లిఫ్టులో గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. అనపర్తికి చెందిన సూర్యనారాయణ(65) తన కుమారుడు భాస్కరరావు నివసిస్తున్న అపార్ట్మెంట్‌కి వెళ్లి, తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్ తెరిచి ఉన్నది చూసుకోకుండా లిఫ్టు గుంతలో పడ్డాడు. విషయం యజమాని భాస్కరరావుకు తెలపగా, అతను వచ్చి చూసేసరికి సూర్యనారాయణ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 23, 2026
తూ.గో జిల్లా అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

తూర్పుగోదావరి జిల్లాల్లోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ మొదటి ఏడాది సీట్ల భర్తీకి దరఖాస్తులను తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 19లోపు https://apbragcet.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 1, 2 తేదీల్లో ప్రవేశ పరీక్షలు ఉంటాయి.
News January 23, 2026
తూ.గో. జిల్లాలో కలిసిన 4 పోలీస్ స్టేషన్‌లు

జిల్లాల పునర్విభజనలో భాగంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని తూ.గో జిల్లాలో విలీనం చేస్తూ కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ప్రకారం రామచంద్రాపురం సబ్ డివిజన్ పరిధిలోని మండపేట టౌన్, రూరల్, అంగర, రాయవరం పోలీస్ స్టేషన్లు రాజమహేంద్రవరం తూర్పు మండలం పరిధిలోకి వచ్చాయి. అలాగే, తూర్పు మండలంలోని బొమ్మూరు స్టేషన్‌ను దక్షిణ మండలానికి మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
News January 23, 2026
రాజమండ్రిలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం

జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ గురువారం పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. PGRS ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలని, మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలని, రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


