News March 10, 2025
అనాతవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ముమ్మిడివరం మండలం అనాతవరం సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ఆబోతును ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందాడు. వెనక కూర్చున్న వ్యక్తికి గాయాలయ్యాయి. కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 10, 2025
ఆ రైతులకూ రూ.20వేలు: మంత్రి అచ్చెన్న

AP: అర్హులైన ప్రతి రైతుకు ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో అన్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి బ్యాంకుల్లో జమ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులు, వెబ్ ల్యాండ్‌లో నమోదైన వారికీ పథకం వర్తిస్తుందన్నారు. మరో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. రూ.30 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చామన్నారు. 16 రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని వివరించారు.
News March 10, 2025
ట్రంప్ టారిఫ్స్‌తో భారత్‌కు మేలు: RBI మాజీ డిప్యూటీ గవర్నర్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ పెంపుతో భారత్‌కు మేలు జరగొచ్చని RBI మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య అన్నారు. కంపెనీల మధ్య ఇది పోటీతత్వం పెంచుతుందని అంచనా వేశారు. ఫలితంగా తయారీ, ఉత్పత్తిలో నాణ్యత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మానవ వనరుల నైపుణ్యంపై కంపెనీలు పెట్టుబడులు పెడతాయని పేర్కొన్నారు. ఆరంభంలో మార్జిన్లు తగ్గినా చివరికి మంచే జరుగుతుందని వెల్లడించారు.
News March 10, 2025
గద్వాల జిల్లాలో భానుని భగభగలు

గద్వాల జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నందున ఫ్యాన్లు, కూలర్లు వాడకం పెరిగింది. రానున్న రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం మల్దకల్ మండల కేంద్రంలో అత్యధికంగా 40.2°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అలంపూర్ లో 39.9°c, సాతర్లలో 39.3°c, ధరూర్ లో 38.6°c ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.