News July 28, 2024
అనారోగ్యంతో భార్య.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

తూప్రాన్ మం. వెంకటాయపల్లికి చెందిన అశోక్, కనకమ్మ దంపతులు 20ఏళ్ల క్రితం సిద్దిపేట జిల్లా ములుగుకు వచ్చారు. వారి కొడుకు సాయికుమార్‌కు కావ్యతో పెళ్లైంది. కాగా 4నెలల క్రితం కావ్య అనారోగ్యంతో మృతిచెందింది. శనివారం కొత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతిచెందాడు. 4నెలల క్రితం తల్లి, తాజాగా తండ్రి మృతితో వారి ఏడాదిలోపు చిన్నారి అనాథగా మారింది. ఘటనపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
Similar News
News February 17, 2026
పాపన్నపేట: వనదుర్గమ్మకు బోనం సమర్పించిన జోగిని

పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల దుర్గామాత అమ్మవారికి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి జోగిని శ్యామల బోనం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు. యేటా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
News February 16, 2026
పాపన్నపేట: ‘బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉంది’

పాపన్నపేట మండలంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గమాత అమ్మవారికి సోమవారం సాయంత్రం బండ్ల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొని బండ్ల ఊరేగింపు నిర్వహించిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి బండ్ల ఊరేగింపులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆయా శాఖల అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
News February 16, 2026
పాపన్నపేట: కట్టుదిట్టమైన పార్కింగ్.. ఇబ్బందులకు చెక్!

ఏడుపాయల వనజాతరకు వచ్చే భక్తుల కోసం పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని టేకులగడ్డ, చెలిమెకుంట వద్ద భారీ పార్కింగ్ సదుపాయం కల్పించారు. బారికేడ్ల సాయంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. సోమవారం జరిగిన బండ్ల ఊరేగింపు, మంగళవారం జరగనున్న రథోత్సవానికి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


