News June 13, 2024

అనితకు మంత్రి పదవిపై కొణతాల స్పందన

image

పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కడంపై అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్పందించారు. అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ.. కష్ట కాలంలో పార్టీకి సేవలు అందించిన అనితకు మంత్రి రావడంపై స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజల కలలను సాకారం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా పాలన సాగుతుందన్నారు.

Similar News

News July 6, 2025

సింహాచలం గిరి ప్రదక్షిణకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

image

గిరి ప్రదక్షిణ రూట్లో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసు కమిషనర్ శంఖ‌బ్రత బాగ్చి తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గిరి ప్రదక్షణలో పాల్గొనే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.

News July 6, 2025

ప్ర‌చార ర‌థం ప్రారంభమయ్యేది అప్పుడే

image

జులై 9న మ‌.2 గంట‌ల‌కు సింహాచలం గిరిప్రదక్షిణ ప్ర‌చారర‌థం ప్రారంభమవుతుందని ఈవో త్రినాథ‌రావు కలెక్టర్‌కు వివరించారు. తొలిపావంచా వ‌ద్ద అశోక్ గ‌జ‌ప‌తి చేతుల మీదుగా ప్ర‌చారర‌థం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. ఆరోజు రాత్రి 11 గంట‌లకు ర‌థం ఆల‌యానికి చేరుకుంటుంద‌ని, మరుసటి రోజు ఉ.5 నుంచి స్వామివారి ద‌ర్శ‌నాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు.10వ తేదీ సాయంత్రం 7వ‌ర‌కు ద‌ర్శ‌నాలు ఉంటాయన్నారు.

News July 6, 2025

ఈనెల 10న మెగా పేరెంట్ మీట్: కలెక్టర్

image

జిల్లాలని అన్ని పాఠశాలల్లో ఈనెల 10న మెగా పేరెంట్ మీట్ నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న 1385 పాఠశాలల్లో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో హాజరవ్వాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకంలో అతిథిలకు స్కూల్లోనే భోజనం అందించాలన్నారు 212 జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలన్నారు.