News February 25, 2026
అనిల్ అంబానీ ముంబై నివాసం అటాచ్

మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్ ఇచ్చింది. ముంబైలోని ఆయన నివాసం ‘అబోడ్’ను అటాచ్ చేసింది. పాలిహిల్ ప్రాంతంలో ఉన్న ఈ 17 ఫ్లోర్ల లగ్జరీ భవనం విలువ రూ.3,716 కోట్లు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఆస్తుల <<18184400>>జప్తు<<>> విలువ రూ.15,700 కోట్లకు చేరింది. ఈ కేసులో అనిల్ మరోసారి ఢిల్లీలోని ఈడీ ఎదుట త్వరలో హాజరుకానున్నారు. గతేడాది ఆగస్టులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొన్నారు.
Similar News
News February 28, 2026
పార్టీ ఏర్పాటుకు ముందు క్లీన్‌చిట్.. ఇక దూకుడేనా?

TG: లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్‌చిట్ రావడంతో జాగృతి చీఫ్ కవిత దూకుడు పెంచే అవకాశం ఉంది. పార్టీ ఏర్పాటుకు ముందు నిర్దోషిగా తేలడం ఆమెకు సానుకూల అంశమని విశ్లేషకులు చెబుతున్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు BRS నుంచి మద్దతు లభించలేదని కవిత పలుమార్లు వాపోయారు. పార్టీ నుంచి బహిష్కరణ తర్వాత ‘లిక్కర్ క్వీన్’ అంటూ పలువురు BRS శ్రేణులు ఆమెను విమర్శించాయి. మరి ఇప్పుడు వారు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం.
News February 28, 2026
ఇన్‌స్టా పోస్ట్.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రష్మిక

ఇన్‌స్టాలో హీరోయిన్ రష్మిక రికార్డ్ సృష్టించారు. తన పెళ్లి ఫొటోలు పోస్టు చేయగా దానికి 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఇది ఇండియాలో అత్యధిక లైక్స్ సాధించిన ఇన్‌స్టా పోస్ట్‌గా రికార్డులకెక్కింది. ఇప్పటివరకూ ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత చేసిన పోస్ట్‌కు 22.9M లైక్స్ వచ్చాయి. వీటి తర్వాత IPL గెలిచాక కోహ్లీ పోస్ట్‌కు 19.8M, రిటైర్మెంట్ పోస్ట్(19.7M) ఉన్నాయి.
News February 28, 2026
AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<


