News January 1, 2026
అనుకున్న సమయానికి అమరావతి పూర్తి చేస్తాం: నారాయణ

AP: అమరావతి నిర్మాణంపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అనుకున్న సమయానికే రాజధానిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. మూడేళ్లలో పూర్తిస్థాయిలో అమరావతి రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే CM చంద్రబాబు అనేక పెట్టుబడులను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
Similar News
News January 3, 2026
మాగాణి మినుములో కాండపు ఈగ – నివారణ

మాగాణి మినుముకు చీడ పీడల సమస్య ఎక్కువ. పంటకు నష్టం చేసే పురుగుల్లో కాండపు ఈగ ఒకటి. ఇది ఎక్కువగా తొలకరి పైరును ఆశించి, కాండంలో చేరి తినటం వల్ల మొక్క ఎండిపోతుంది. దీని నివారణకు థయామిథాక్సామ్ 70 W.S. 5గ్రాములు లేక ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్.ఎస్. 5mlను కేజీ విత్తనానికి కలిపి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. పైరుపై దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేక డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.
News January 3, 2026
రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్స్’: మంత్రి

TG: ప్రజలకు కంటి వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్స్’ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు. ఈ క్లినిక్‌ల నిర్వహణలో సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ‘హబ్’గా వ్యవహరిస్తుందన్నారు. ‘గత 2ఏళ్లలో 6,12,973 మందికి శుక్లాల ఆపరేషన్లు చేయించాం. 33.65L మంది పాఠశాల విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించి, 76,176 మందికి అద్దాలు పంపిణీ చేశాం’ అని వివరించారు.
News January 3, 2026
జీర్ణశక్తిని పెంచే ఫ్రూట్స్ ఇవే..

శీతాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఫైబర్, ఎంజైమ్స్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. నారింజ, కివి, దానిమ్మ, బొప్పాయి, జామపండు శీతాకాలంలో ఎక్కువగా తినాలి. ఇవి మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం తగ్గించడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అలాగే గ్రేప్ ఫ్రూట్, బెర్రీలు, బెర్రీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శీతాకాలంలో బరువు పెరగకుండా నిరోధిస్తాయంటున్నారు నిపుణులు.


