News September 22, 2025

అనుమతులు తప్పనిసరి: అల్లూరి ఎస్పీ

image

శాంతి భద్రతలకు భంగం కలగకుండా దసరా పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సోమవారం ప్రజలకు సూచించారు. దసరా మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. విగ్రహాల వద్ద తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మండపాల వద్ద డీజేలు, అధిక శబ్ధం చేసే సౌండ్ సిస్టమ్‌లు ఉపయోగించకూడదన్నారు. నిబంధనలు పాటిస్తూ, పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.

Similar News

News September 22, 2025

భూములిచ్చిన రైతులను ఆదుకుంటాం: CM

image

గూగుల్ డేటా సెంటర్ కోసం తర్లువాడలో భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని CM చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నగరానికి వచ్చిన ఆయనకు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. డేటా సెంటర్ కోసం రైతులు భూములిచ్చి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారన్నారు. రైతుల విజ్ఞప్తిని పరిశీలించి భూ పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని CM పేర్కొన్నారు.

News September 22, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన దేవీ నవరాత్రులు
✓లక్ష్మీదేవిపల్లి: ఎదురుగడ్డ గ్రామంలో పోలీసుల కార్డెన్ సెర్చ్
✓చుంచుపల్లి: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
✓ఇల్లందులో బొగ్గు బావులు ఏర్పాటు చేయాలి: IFTU
✓మణుగూరులో ఆర్టీసీ బస్సు కారు ఢీ.. తప్పిన ప్రమాదం
✓డిప్యూటీ సీఎంకు పాల్వంచ కేటీపీఎస్ భూనిర్వాసితుల వినతి
✓చర్ల: ఇసుక ర్యాంపులో దివ్యాంగులకు అవకాశం కల్పించాలని ITDA POకు వినతి

News September 22, 2025

NZB: ప్రజావాణికి విశేష స్పందన

image

నిజమాబాద్ పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు సీపీ సాయి చైతన్యకు సమస్యలు విన్నవించారు. 29 ఫిర్యాదులను సీపీ స్వీకరించారు. వాటి పరిష్కారానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా నేరుగా పౌరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.