News February 23, 2025
అనుమతులు లేకుండా మట్టి తవ్వితే శిక్షార్హులు: కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా ఖనిజ నియమావళి, 1966 ప్రకారం గనులు భూగర్భ శాఖ వారి అనుమతి లేకుండా ఏ వ్యక్తి క్వారీ నిర్వహణ చేపట్టరాదని కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో ఆదేశించారు. అనుమతి రవాణా పత్రం లేకుండా ఖనిజ రవాణా నిర్వహించకూడదన్నారు. నియమాలు ఉల్లంఘన చేసిన వారు శిక్షార్హులని, అటువంటి ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
Similar News
News February 23, 2025
RJY: నేడు గ్రూప్-2 పరీక్ష..పావుగంట ముందే గేట్ క్లోజ్

రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్ -2 పరీక్ష జరగనుంది. ఉదయం 10.గ నుంచి 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3.గ నుంచి 5.30 వరకు పేపర్-2 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రారంభానికి గంటాన్నర ముందుగానే ప్రధాన గేట్లును మూసివేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీసీఆర్‌పీసీ సెక్షన్ 163 అమల్లో ఉంటుందన్నారు. షెడ్యూలు ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ఎపీపీఎస్సీ బోర్డు తెలిపింది.
News February 22, 2025
తూ.గో. జిల్లా TODAY TOP NEWS

➤కొవ్వూరు: హీరో రామ్‌ను కలిసిన మంత్రి దుర్గేశ్
➤అనపర్తి: నల్లమిల్లి తనయుడిని ఆశీర్వదించిన తోట
➤కడియం: చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు అరెస్ట్
➤సీతానగరంలో కమెడియన్ల సందడి
➤కొవ్వూరు: హత్య కేసులో ముద్దాయి అరెస్ట్
➤రాజమండ్రి: పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి
➤రాజమండ్రిలో కేంద్ర మంత్రి పర్యటన
➤రాజానగరం: ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‌కు గ్రీన్ సిగ్నల్..!
➤కొంతమూరులో చెత్త సేకరణపై అవగాహన
News February 22, 2025
కొవ్వూరు: హీరో రామ్‌ను కలిసిన మంత్రి దుర్గేశ్

కొవ్వూరు సమీపంలోని కుమారదేవంలో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో జరుగుతున్న #RAPO22 షూటింగ్‌కి వచ్చిన ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పి.మహేష్ బాబులను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మంత్రి దుర్గేశ్‌కి ఘన స్వాగతం పలికింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.