News April 20, 2024

అనుమానం.. భార్య, పిల్లలను లోపల వేసి ఇంటికి నిప్పు

image

అనుమానంతో భార్య, పిల్లలను లోపల ఉంచి ఇంటికి నిప్పుపెట్టాడో భర్త. ఈ ఘటన భీమడోలులో జరిగింది. SI సుధాకర్ వివరాల ప్రకారం.. అర్జావారిగూడెంకు చెందిన నాగరాజు-వెంకటలక్ష్మికి 2009లో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. నాగరాజు అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఈనెల 15న భార్య, పిల్లలను ఇంట్లో వేసి నిప్పు పెట్టాడు. వారు కేకలేస్తూ తలుపులు పగులగొట్టుకొని బయటకు వచ్చారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Similar News

News September 30, 2024

విషాదం.. 18వ అంతస్తు నుంచి దూకి తల్లీకూతుళ్ల సూసైడ్

image

భీమవరంలో విషాదం నెలకొంది. 3ఏళ్ల కుమార్తెతో కలిసి 18వ అంతస్తు నుంచి దూకి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన మానస(30) భర్త, కూతురు కృషితో కలిసి HYDలోని నార్సింగి సమీపంలో నివాసం ఉంటోంది. భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆదివారం రాత్రి మానస కూతురితో కలిసి బిల్డింగ్‌ పైనుంచి దూకేసింది. అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 30, 2024

బాగా చదవాలన్నందుకు కాలువలో దూకిన విద్యార్థి

image

బాగా చదివి పదో తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెప్పినందుకు ఓ విద్యార్థి కాలువలో దూకేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారావుకు కుమారుడు పోలినాయుడు(16), కుమార్తె సంతానం. ఆదివారం కుమార్తె పుట్టిన రోజు వేడుకలను పెద్దింటమ్మ ఆలయం వద్ద నిర్వహించారు. ఈ క్రమంలో పేరెంట్స్, బంధువులు ‘పది’లో మంచి మార్కులు తెచ్చుకోవాలని పోలినాయుడితో అనగా.. మనస్తాపానికి గురై వెళ్లి కాలువలో దూకేశాడు.

News September 29, 2024

జగన్‌కు పరిపాలన చేయడం రాదు: మంత్రి నారాయణ

image

ఏపీ మాజీ సీఎం జగన్‌కు పరిపాలన చేయడం రాదని మంత్రి నారాయణ అన్నారు. పాలకొల్లు టిడ్కో ఇళ్ల వద్ద మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడ్కో ఇళ్లకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి ఎంత ఖర్చైనా పర్వాలేదని సీఎం చంద్రబాబు అన్నారని చెప్పారు. పాలకొల్లులోని ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.