News April 1, 2024

అనుమానాస్పద లావాదేవీలపై తనిఖీలు నిర్వహిస్తాం: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న సమయంలో రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్తే సంబంధిత రశీదు, ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వ్యాపార సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలు పాల్గొన్నారు.

Similar News

News September 29, 2024

వెల్దుర్తి: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన వెల్దుర్తిలో చోటుచేసుకుంది. పట్టణంలోని డోన్ రైల్వే గేట్ల సమీపంలో ఉన్న ఈద్గా వద్ద కాచిగూడ నుంచి యశ్వంతపూర్ వెళుతున్న వందే భారత్ రైలు కింద మస్తాన్ వలి (74) పడడంతో శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. కర్నూలు రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News September 29, 2024

2న జిల్లాస్థాయి స్కేటింగ్ ఎంపిక పోటీలు

image

జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు కర్నూలు ఔట్ డోర్ స్టేడియంలో అక్టోబర్ 2న నిర్వహిస్తున్నట్లు జిల్లా రోలర్ స్కేటింగ్ సంఘం కార్యదర్శి పక్కిరెడ్డి తెలిపారు. ఇన్లైన్, క్వాడ్ స్కేటింగ్ క్రీడాంశలలో రింక్ రేస్, రోడ్ రేస్‌లలో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల వారు RSFI పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారు నవంబర్ 6-10వ తేదీ వరకు కాకినాడలో జారిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.

News September 29, 2024

రేపు నందికొట్కూరులో జాబ్ మేళా

image

నందికొట్కూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ సునీత తెలిపారు. 10వ తరగతి, ఆపై చదివిన నిరుద్యోగులు ఈ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్వ్యూలో పాల్గొనే అభ్యర్థులు tinyurl.com/jobmelagdcndk లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.