News December 25, 2025
అనూహ్య రద్దీ.. శ్రీవాణి టికెట్ల జారీపై TTD కీలక నిర్ణయం

తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తిరుమలతోపాటు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న శ్రీవాణి టికెట్ బుకింగ్ ఆఫీసుల్లో టికెట్లు ఇవ్వరని టీటీడీ తెలిపింది. మరోవైపు శిలా తోరణం వరకు భక్తులు వేచిచూస్తున్నందున సర్వదర్శనానికి వచ్చేవారిని క్యూ లైన్లలోకి తాత్కాలికంగా అనుమతించడం లేదు.
Similar News
News December 26, 2025
సూర్యవంశీకి ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’

క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(14)కి ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. వీర్ బాల్ దివస్ పేరిట ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ అందుకున్నారు. చిన్న వయసులో కల్చర్, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్‌లో అసాధారణ ప్రతిభ కనబర్చిన వారికి ఈ పురస్కారం ఇస్తారు. ఈ ఏడాది 18 రాష్ట్రాల నుంచి 20 మంది పిల్లలు దీనికి ఎంపికయ్యారు.
News December 26, 2025
సీసీఎంబీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

హైదరాబాద్‌లోని CCMBలో 9 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు DEC 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BSc, డిప్లొమా, MSc (నేచురల్ సైన్స్), BE, B.Tech, PhD (బయో ఇన్ఫర్మాటిక్స్/జెనిటిక్స్/లైఫ్ సైన్స్, జీనోమిక్స్, మైక్రో బయాలజీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in
News December 26, 2025
జామలో తెల్ల సుడిదోమను ఎలా నివారించాలి?

తెల్లసుడి దోమ పిల్ల పురుగులు జామ ఆకులపై తెల్లని దూది వంటి మెత్తని పదార్థంతో ఉండి, రసం పీల్చడం వల్ల ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. జిగురు పూసిన పసుపురంగు అట్టలను చెట్టు కొమ్మలకు వేలాడతీయాలి. తెగులు ఆశించిన కొమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. తర్వాత లీటరు నీటిలో 5మి.లీ వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి హాస్టాథియాన్ 1మి.లీ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.


