News March 25, 2024

అన్నం పెట్టిన ఇంటికే సున్నం.. రూ.7.50 లక్షల చోరీ?

image

ప.గో జిల్లా ఆకివీడులోని మందపాడుకి చెందిన దుర్గాప్రసాద్ ఇంట్లోంచి రూ.7.50 లక్షలు చోరీ అయ్యాయి. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనెల 20న ఓ కుర్రాడు తమ వద్దకు వచ్చి అనాథనని, ఆకలేస్తుందని చెప్పాడని, అన్నం పెట్టి తమ వద్దే ఉంచుకున్నట్లు తెలిపారు. ఇంటికి తాళం వేసి బయటకెళ్లి తిరిగొచ్చేసరికి తాళాలు పగలగొట్టి బీరువాలోని
నగదు కాజేశారని, అప్పటి నుంచే ఆ బాలుడూ కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News February 7, 2025

అధికారులు నివేధికలు ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలో సహాకార రంగాన్ని బలోపేతం చేసేందుకు సంబంధిత శాఖలు వారి భవిష్యత్తు కార్యాచరణతో పూర్తి స్థాయి నివేదికలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేటులో 19 శాఖల అధికారులతో జరిగిన జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 688 సహకార సంఘాలు ఉన్నాయని, వాటిలో 667 సంఘాలు పని చేస్తున్నాయని జిల్లా సహకార అధికారి నాగరాజు కలెక్టర్‌కు వివరించారు.

News February 6, 2025

తమ్ముడిపై దాడి చేసిన అన్న.. చికిత్స పొందుతూ మృతి: ఎస్ఐ శ్రీనివాస్

image

కాళ్ల మండలంలో అన్నదమ్ముల మధ్య స్థల విషయంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అన్న సత్యనారాయణ తమ్ముడు రమేశ్‌పై దాడి చేయగా భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కాళ్ల ఎస్ఐ ఎన్. శ్రీనివాస్ గురువారం తెలిపారు. పెదఅమిరంకు చెందిన రమేశ్ భార్య వరలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. నిమ్మలకు 22వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ప.గో జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు 22వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

error: Content is protected !!