News April 3, 2025
అన్నపురెడ్డిపల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం

భద్రాద్రి జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్దిరెడ్డిగూడెంలో షార్ట్ సర్క్యూట్‌తో రెండు ఇళ్లు దగ్ధమైయ్యాయి. ఈ ప్రమాదంలో మంటలు అంటుకొని ఒకరు మృతి చెందారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 4, 2025
CMతో SRపురం వాసి భేటీ

CM చంద్రబాబును గురువారం అమరావతి సెక్రటేరియట్‌లో ఎస్.ఆర్ పురం మండల టీడీపీ అధ్యక్షుడు జయశంకర్ నాయుడు మర్యాదపూర్వక కలిశారు. అనంతరం మండలంలో నెలకొన్న సమస్యలు, రాజకీయాలపై వారు చర్చించారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని CM హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
News April 4, 2025
ఈ నెల 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

AP: ఈ నెల 7 నుంచి రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో NTR వైద్య సేవలను నిలిపేస్తున్నట్లు ఏపీ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం నుంచి రూ.3,500 కోట్ల బకాయిలు రావాలని, దీంతో ఆస్పత్రుల నిర్వహణ చేయలేకపోతున్నామని వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ బకాయిలు కూడా ఇవ్వలేదని, చేసిన అప్పులు తీర్చలేకపోతున్నామని పేర్కొంది. ప్రభుత్వం స్పందించి రూ.1,500 కోట్లు మంజూరు చేయాలని కోరింది.
News April 4, 2025
IPL: నేడు లక్నోతో ముంబై అమీతుమీ

IPLలో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నో వేదికగా ముంబై, లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. తమకు అలవాటైన రీతిలోనే MI తొలుత వరుసగా మ్యాచులు ఓడింది. కానీ సొంతగడ్డపై KKRను చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అటు లక్నో కూడా 2 మ్యాచులు ఓడి ఒకదాంట్లో గెలిచింది. చివరిగా PBKSపై ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఇవాళ ముంబైని ఓడించి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది.