News September 24, 2025
అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ

దేవీ శరన్నవరాత్రులలో మూడో రోజున దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆహార, పోషణకు ప్రతీక అయిన ఈ అలంకారంలో అమ్మవారు స్వర్ణపాత్ర, బంగారు త్రిశూలం, అభయహస్తాలతో అలరారుతూ కనులవిందు చేశారు. ఈ రూపంలో దుర్గమ్మను పూజిస్తే అన్నానికి లోటు ఉండదని భక్తుల విశ్వాసం.
Similar News
News September 24, 2025
రాజేంద్రనగర్‌లో కత్తితో గొంతుకోసి హత్య

రాజేంద్రనగర్‌లో బుధవారం ఉదయం ఓ వ్యక్తి డెడ్‌బాడీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏసీపీ శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు వెల్లడించారు. కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని, ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్వక్తి బండ్లగూడకు చెందిన మీనాస్ ఉద్దీన్‌గా గుర్తించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
News September 24, 2025
‘OG’ కోసం ఒక్కరోజు థియేటర్లు ఇచ్చిన ‘మిరాయ్’ మేకర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా రేపు విడుదల కానుంది. కొన్ని చోట్ల ఇవాళ రాత్రి స్పెషల్ షోలున్నాయి. ఈక్రమంలో ‘మిరాయ్’ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు ‘మిరాయ్’ ప్రదర్శించే చాలా థియేటర్లను ‘OG’కి ఇస్తున్నట్లు తెలియజేశారు. పవన్‌పై ఉన్న అభిమానంతోనే ఇలా చేసినట్లు తెలిపారు. ఇక 26వ తేదీన మళ్లీ ఆ థియేటర్లలో ‘మిరాయ్’ ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ.140+కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
News September 24, 2025
HYD డెవలప్‌మెంట్‌లో రేవంత్ vs KCR!

బతుకమ్మ కుంట చుట్టూ రాజకీయం మొదలైంది. బే‘కారు’ పాలన..‘ప్రజా’పాలనకు తేడా ఇదే అంటూ కాంగ్రెస్ నేతలు బతుకమ్మ కుంట వీడియోలు SMలో పోస్ట్ చేశారు. అయితే, KCR రంగదాముని చెరువు, మల్కంచెరువు, దుర్గం చెరువులను అభివృద్ధి చేసినా ప్రచారం చేసుకోలేదని BRS నేతల వాదన. 5 ఎకరాల కుంటను అభివృద్ధి చేసిన రేవంత్ గొప్పనా?.. ఎన్నో చెరువులను సుందరీకరించిన KCR గొప్పనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై హైదరాబాదీ కామెంట్?