News January 2, 2026

అన్నమయ్యలో రూ.5.54కోట్ల మద్యం తాగేశారు!

image

అన్నమయ్య జిల్లాలో నూతన సంవత్సర సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. అన్నమయ్య జిల్లాలో 11 బార్లు, 124 వైన్ షాపులు ఉన్నాయి. అన్ని రకాల బ్రాండ్లతో కలిపి 7,463 మద్యం బాక్సులు, బీర్లు 3,475 బాక్సులు ఐఎంఎల్ డిపో నుంచి షాపులకు చేరాయి. ఈ మద్యాన్ని ఒకటో తేదీన మందు బాబులు తాగడంతో ప్రభుత్వానికి రూ.5.54కోట్ల ఆదాయం వచ్చింది.

Similar News

News January 2, 2026

NZB: మున్సిపాలిటీల్లో బోగస్ ఓట్లపై కదిలిన విపక్షాలు

image

ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు గెలుపోటములను మార్చే అవకాశం ఉంది. దీంతో ఆర్మూర్‌లోని ఓటర్ల జాబితా సవరించాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రావణికి రెండు పార్టీలు వినతిపత్రాలు అందజేశాయి. ఆధార్‌కు అనుగుణంగా అలాగే ఏ వార్డులో ఉన్న కుటుంబాలకు అందులోనే ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశాయి.

News January 2, 2026

పల్నాడు కలెక్టర్‌ను ప్రశంసించిన చంద్రబాబు

image

పల్నాడు కలెక్టర్ కృత్తికా శుక్లాను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మలిచిన తీరు అభినందనీయమన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్‌లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.

News January 2, 2026

AMPRIలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI)లో 13 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 4 ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిప్లొమా, బీఎస్సీ(సైన్స్, CS), టెన్త్, ఐటీఐ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. టెక్నికల్ అసిస్టెంట్‌కు నెలకు రూ.66,500, టెక్నీషియన్‌కు రూ.37,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ampri.res.in